Saturday, November 23, 2024

మురిపించే మెలోడి సాంగ్

- Advertisement -
- Advertisement -

Melody Song

సంతోష్ శోభన్, గౌరి జి.కిషన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శ్రీదేవి శోభన్ బాబు’. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి గుడ్ ఫ్రైడే సందర్భంగా ‘నిను చూశాక..’ అనే పాటను సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ విడుదల చేశారు. ఈ మెలోడీ సాంగ్‌ను సంతోష్ శోభన్, గౌరి జి కిషన్‌లపై చిత్రీకరించారు. సంగీత దర్శకుడు కమ్రాన్ ఈ పాటకు అద్భుతమైన ట్యూన్‌ని కంపోజ్ చేశారు. రాకేందు మౌళి రాసిన ఈ పాటను జునైద్ కుమార్ ఆలపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News