నల్గొండ : నల్గొండ జిల్లా పెద్దవూర మండలం నాగార్జునసాగర్ నడిబొడ్డున విజయ విహార్‌లో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ మహాసభలు బుధవారంతో ముగిశాయి. చివరి రోజు 22 రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ నాయకులు నాగార్జునసాగర్‌లోని లాంచ్ స్టేషన్లో లాంచ్‌పై వెళ్లిన నాగార్జున కొండను సందర్శించారు. ఈ సందర్బంగా నాగార్జునకొండపై ఉన్న ఆలయాలు బౌద్దరామాలు కనుల పండుగగా ఉన్నాయని కొనియాడారు. దాంతో పాటుగా బుద్ధవనాలు, ప్రాంతాలను సందర్శించి సంతోషం వ్యక్తం చేశారు.
22 రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు నాగార్జునసాగర్‌లోని పలు ప్రాంతాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆల్ ఇ ండియా అధ్యక్షులు విజయరాఘవన్, ఆల్ ఇండియా సహాయ కార్యదర్శి శివదాసన్, ఆల్ ఇండియా సహాయ కార్యదర్శి శివదాసన్, ఆల్ ఇండియా సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్, కేంద్ర కమిటీ స భ్యులు నారి ఐలయ్య, రాష్ట్ర కార్యదర్శి ఆర్. వెంకట్‌రాములు, సీఐటీయూ రాష్ట్ర నాయకులు కెవి రాష్ట్ర ఉపాధ్యాక్షులు బొప్ప పద్మ, జిల్లా అధ్యక్షులు బొజ్జ చిన్న వెంకట్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కూన్‌రెడ్డి, నాగిరెడ్డి, కంబాలపల్లి, ఆనందు, కత్తుల లింగస్వామి, అవుత సైదయ్య, కుంకుమూరి కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.