Friday, December 20, 2024

గద్వాల ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజాప్రతినిధులు

- Advertisement -
- Advertisement -

గద్వాలటౌన్: నియోజకవర్గ అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ధరూర్ మండలంలో మహాత్మ జ్యోతి బాపులే బీసీ గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా ర్యాలంపాడు రిజర్వాయర్ నిర్వాసితులకు షిప్టింగ్ చార్జ్ కొరకు లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ కావడం జరిగింది.

ఈ సందర్భంగా ఆదివారం ధరూర్ వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం శాలువాతో ఎమ్మెల్యేను సన్మానించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ధరూర్ మండల సర్పంచులు, ర్యాలంపాడు గ్రామ సర్పంచు, బిఆర్‌ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News