Thursday, January 23, 2025

కలెక్టర్‌ని సన్మానించిన రెడ్ క్రాస్ సభ్యులు

- Advertisement -
- Advertisement -

మెదక్ ప్రతినిధిః నిరుపేదలకు, ఆర్తులకు, వృద్దులకు, మారుమూల ప్రాంతాలకు రెడ్‌క్రాస్ సేవలను విస్తరించాలని ఇండియాన్ రెడ్ క్రాస్ సోసైటీ మెదక్ శాఖ అద్యక్షులు, కలెక్టర్ రాజర్షి షా అన్నారు. నేడు నూతనంగా ఎన్నుకోబడిన మెదక్ రెడ్‌క్రాస్ కమిటీ కలెక్టర్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే రక్తనిధి కేంద్రాన్ని, వృద్దులకు ఆశ్రమాన్ని, ఇతర సేవా కార్యక్రమాలను కొనసాగించడానికి పక్కా భవనానికి ఒక ఎకరం స్థలం కేటాయించాలని మెదక్ జిల్లా చైర్మన్ ఏలేటి రాజశేఖర్‌రెడ్డిని కోరడం జరిగింది.

అలాగే ప్రస్తుతమున్న కలెక్టరేట్ కాంప్లెక్స్ తమకు కేటాయించిన మూడవ అంతస్థులోని 301 రూమును ఇప్పించాలని కోరగా నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్‌లోని ఒక రూమును కేటాయిస్తానని సభ్యులకు హామీ ఇచ్చారు. రక్తనిధి కేంద్రాన్ని, వృద్దాశ్రమాన్ని నిర్మించడానికి తప్పకుండా ప్రయత్నిస్తానని కలెక్టర్ సభ్యులకు హామీ ఇవ్వడం జరిగింది. నిరుపేదలకు అర్తులకు వృద్దులకు మారుమూల ప్రాంతాలకు రెడ్ క్రాస్ సేవలను విస్తరించాలని ఇండియాన్ రెడ్ క్రాస్ సోసైటీ మెదక్ శాఖ అద్యక్షుడు కలెక్టర్ అన్నారు. సభ్యులందరు రెడ్ క్రాస్ శాఖ అద్యక్షులు అయిన కలెక్టర్‌ని ఘనంగా సన్మానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News