Tuesday, December 24, 2024

కార్యకర్తల సంక్షేమం కోసమే సభ్యత్వ బీమా

- Advertisement -
- Advertisement -

సదాశివనగర్ : బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఆలోచించి ముఖ్యమంత్రి కెసిఆర్ కార్యకర్తలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురెందర్ పేర్కొన్నారు. శనివారం సదాశివనగర్ మండల వజ్జాపల్లి గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ కార్యకర్త కుటుంబానికి ఎల్లారెడ్డి క్యాంపు కార్యాలయంలో రూ. 2 లక్షల పార్టీ ప్రమాద బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వజ్జాపల్లి గ్రామానికి చెందిన ఒడ్డెలాలు ఇటీవల మక్కలు పట్టే యంత్రంలో పడి మృతి చెందారు. ఆయనకు బిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం కలిగి ఉండటంతో రెండు లక్షల రూపాయల బీమా మంజూరైనట్లు తెలిపారు. చెక్కును మృతుడి భార్య లలితకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఎమ్మెల్యే కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ ఎర్రం నర్సయ్య, ఉప సర్పంచ్ ప్రభాకర్ రావు, బిఆర్‌ఎస్ పార్టీ గిరిజన నాయకుడు శ్రీనివాస్ నాయక్, సీనియర్ నాయకులు గైని రమేష్, మండల అధ్యక్షుడు బొలిపల్లి మహెందర్ రెడ్డి, గ్రామ అద్యక్షుడు కలిగోట శ్రీనివాస్, రైతు బంధు మండల అధ్యక్షుడు భూంరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ రామారావు, నాయకులు మడిపెద్ది ఆనంద్, యండి.ఉమర్, సుబ్బారావు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News