Monday, December 23, 2024

పొదుపు సంఘాల్లో వృద్ధులకూ సభ్యత్వం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అరవై ఏళ్ల వయసు దాటిన మహిళలకు కూడా పొదుపు సంఘాల్లో సభ్యత్వం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం పాత సంఘాల్లో కొనసాగింపు లేదా కొత్త సంఘాలను ప్రారంభించి వారిని కలుపుకొని పోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులను ఆదేశించింది. వీటిని ఇకపై ఈఎస్‌హెచ్ (ఎల్డర్ సెల్స్ హెల్ప్ గ్రూపు) అని పిలుస్తారు. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు నలభై ఏళ్ల క్రితం ద్వారా గ్రూపుల్లో చేరిన మహిళల వయస్సు ఇప్పుడు 60 ఏళ్లు దాటింది. సంపాదించే శక్తిని కోల్పోయి. కూలీ పనులకు వెళ్లలేక ప్రభుత్వం ఇచ్చే పింఛను వారు కాలం వెళ్లదీస్తున్నారు. 1982లో ప్రారంభించిన సంఘాల్లో చేరిన మహిళలు పొదుపు సంఘాలకు మార్గదర్శకులుగా నిలిచారు. ఇప్పటి మహిళా సంఘాల సభ్యులు వారు నడిచిన బాటలోనే నడుస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News