Saturday, December 28, 2024

ప్రయాణికులకు అందుబాటులోకి ‘మెమూ’ రైళ్లు

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్ టు -ఉందానగర్-
ఉందానగర్ టు మేడ్చల్
కనీస చార్జీ రూ.10, గరిష్ట చార్జీ రూ.15లు

 

మనతెలంగాణ/హైదరాబాద్:  మెమూ (మొయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టీపుల్ యూనిట్) ప్యాసింజర్ రైళ్లను పునఃప్రారంభించాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. సికింద్రాబాద్ రీజియన్ పరిధిలో ఈ రైళ్లను నడపాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించినట్టుగా తెలిసింది. అందులో భాగంగా ప్రయాణికులకు తక్కువ చార్జీలతో ఈ సేవలను రైల్వే శాఖ అందించనుంది. ప్రధానంగా సికింద్రాబాద్ టు -ఉందానగర్-, ఉందానగర్ టు మేడ్చల్ మధ్య ఈ రైళ్లను నడపనున్నారు. సికింద్రాబాద్- టు ఉందానగర్ మార్గాల్లో నడిచే మెమూ రైళ్లు సీతాఫల్‌మండి, ఆర్ట్‌కాలేజీ, జామై ఉస్మానియా, విద్యానగర్, కాచిగూడ, మలక్‌పేట్, డబీర్‌పురా, యాకుత్‌పురా, ఉప్పుగూడ్, ఫలక్‌నుమా, శివరాంపల్లి, బుద్వేల్ స్టేషన్‌లలో ఆగనున్నట్టు తెలిపారు.

ఉందానగర్ నుంచి మేడ్చల్ వెళ్లే మెమూ రైళ్లను బుద్వేల్, ఎన్‌పిఎ శివరాంపల్లి, ఫలక్‌నుమా, ఉప్పుగూడ, యాకుత్‌పురా, డబిర్‌పురా, మలక్‌పేట, కాచిగూడ, విద్యానగర్, జామై ఉస్మానియా, ఆర్ట్ కాలేజీ, సీతాఫల్‌మండి, మల్కాజిగిరి, దయానంద్ నగర్, సఫిల్‌గూడ, రామకిష్టాపురం గేట్, అమ్ముగూడ, కల్వారి బ్యారక్స్, అల్వాల్, బొలారం బజార్, బొలారం, గుండ్ల పోచంపల్లి, గౌడవల్లి స్టేషన్లలో అగుతాయని అధికారులు తెలిపారు. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే రైళ్లు గౌడవల్లి, గుండ్ల పోచంపల్లి, బొలారం, బొలారం బజార్, అల్వాల్, కల్వారి బ్యారక్స్, అమ్ముగూడ, రామకిష్టాపురం గేట్, సఫిల్‌గూడ, దయానంద్ నగర్, మల్కాజిగిరి స్టేషన్‌లలో ఆగుతాయి.

టికెట్ కౌంటర్లలో, డిజిటల్ విధానంలో కొనుగోలు

నగర శివారు ప్రాంత ప్రయాణికులకు ఇతర రవాణాలతో పొల్చితే మెమూ రైలు సర్వీసుల ప్రయాణం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు. తక్కువ ప్రయాణ సమయంతో పాటు మరింత సౌకర్యవంత ప్రయాణంతో పాటు రోజువారీ ప్రయాణికులకు ఇది అనుకూలంగా ఉంటుంది. ఉదయం, సాయంత్రం రద్దీ వేళలో డిమాండ్‌కు తగ్గట్టుగా అనుకూల సమయాల్లో ఈ సర్వీసులను ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ రెండు మార్గాల్లో మెమూ రైళ్ల ఛార్జీలను కనీస చార్జీ రూ10, గరిష్ట చార్జీ రూ 15లుగా నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ రైలు టికెట్లను ప్రయాణికులు టికెట్ కౌంటర్లలో, డిజిటల్ విధానంలో కొనుగోలు చేయవచ్చని అధికారులు తెలిపారు. మొదటి విడతలో 16 రైళ్లను, అనంతరం మరో 10 రైళ్లను ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే అందుబాటులోకి తీసుకురానుంది. ఉదయం 6.15 నిమిషాల నుంచి రాత్రి 10.50 నిమిషాల వరకు ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News