Monday, December 23, 2024

పురుషుల్లోనే కొవిడ్ రిస్కు ఎందుకెక్కువ ?

- Advertisement -
- Advertisement -

కొవిడ్ 19కు స్పందించే వ్యాధి నిరోధక కణాలు (immune cells), యాంటీబాడీల ( antibodies )ఉత్పత్తిలో లైంగిక నిర్దిష్ట బేధాల( sex specific differences) వల్లనే పురుషుల్లో కొవిడ్ రిస్కు ఎక్కువగా తలెత్తుతోందని జపాన్ ఒసాకా వర్శిటీ పరిశోధకులు గుర్తించారు. దీనికి కారణాలను వారు తెలుసుకోగలిగారు. ఒక రకం ఇమ్యూన్ సెల్స్‌లో ఈ లైంగిక బేధాలను కనుగొన్నారు. ఈ ఇమ్యూన్ సెల్స్‌ను రెగ్యులేటరీ టి సెల్స్ ( t cells ) లేదా “ట్రెగ్ సెల్స్‌”( cells) గా వ్యవహరిస్తున్నారు. అలాగే ప్రొటీన్ల ఉత్పత్తిని యాంటీబాడీలని పిలుస్తున్నారు.

పురుషులు ఎక్కువ రిస్కులో ఉండడానికి ఈ బేధమే కారణమని, అయితే ఈ బేధానికి ఆధారమైన అంతర్లీన కణ వ్యవస్థ ఏమిటో అర్థం కావడం లేదని చెప్పారు. వైరల్ ఇన్‌ఫెక్షన్లను నిర్మూలించడం ఇమ్యూన్ వ్యవస్థ బాధ్యత. కానీ కొవిడ్ తీవ్రమైన లక్షణాలకు కూడా ఇదే కారణమవుతోంది. అందువల్ల వ్యాధినిరోధక ( ఇమ్యూన్) వ్యవస్థలో ఈ మార్పులను అర్థం చేసుకోవడం కష్టతరమవుతోంది. ఈ అపహాస్యమైన స్పందన, యాంటీబాడీల ఉత్పత్తి, కొవిడ్ 19 లో క్రమబద్ధీకరించ బడడం లేదన్న నిర్ణయానికి పరిశోధకులు వచ్చారు. ఇమ్యూన్ వ్యవస్థలో ఇతర ఇమ్యూన్ సెల్స్‌ను క్రమబద్ధీకరించడం ,స్పందన బలాన్ని నియంత్రించడం కోసం వాటి చర్యలను అణచివేయడం ట్రెగ్ సెల్స్ పాత్ర . ట్రెగ్ సెల్స్‌కు ఉప కణాలైన టిఫాలిక్యులర్ రెగ్యులేటరీ సెల్స్ (tfr cells) బాధ్యత యాంటీబాడీ ఉత్పత్తిని నియంత్రించడం. కానీ మహిళా రోగుల కంటే పురుష రోగులే వేగంగా టిఎఫ్‌ఆర్ కణాలను వ్యాపింప చేసే శక్తిని కోల్పోతున్నారు.

వైరస్‌ను టార్గెట్ చేయడానికి బదులుగా శరీరంలో ఉత్పత్తి అయ్యే ప్రొటీన్లే యాంటీబాడీల ఉద్దేశంగా ఉంటోంది. అందువల్ల రక్షించే అంశాలను ఇవి తటస్ఠీకరిస్తుంటాయని తెలిపారు. వీటి ఉత్పత్తి కూడా ఇన్‌ఫెక్షన్ పెరగడానికి కీలక పాత్ర వహించవచ్చని చెప్పారు. స్పందనలో లైంగిక పక్షపాతం కనిపిస్తోందని, మహిళల్లో టిఎఫ్‌ఆర్ కణాలు బాగా వ్యాప్తి చెందుతుండగా, పురుష రోగుల్లో మాత్రం యాంటీబాడీ స్థాయిలు ఎక్కువగా ఉంటున్నాయి.. కొవిడ్ రోగుల్లో యాంటీబాడీలు సరిగ్గా క్రమబద్ధం కావడం లేదనడానికి ఇది చెప్పుకోదగిన కణజాల సాక్షం. ఈ పరిస్థితే కొవిడ్ రోగుల్లో ముఖ్యంగా పురుష రోగుల్లో టిఎఫ్‌ఆర్ కణాలు క్షీణించడానికి ఆధారం కావచ్చునని భావిస్తున్నారు.

ఈ విధమైన లైంగిక పక్షపాతాన్ని సరిగ్గా గుర్తించ గలిగితేనే ప్రతిరోగిని రక్షించడానికి వీలవుతుందని, ముఖ్యంగా ఎక్కువ రిస్కులో ఉన్న వారిని కాపాడుకోగలుగుతామని పరిశోధకులు సూచించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్ ప్రొసీడింగ్స్‌లో ఈ పరిశోధన వివరాలు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా, ఆడవాళ్ల కన్నా మగవాళ్ల లోనే కరోనా మరణాలు ఎక్కువగా ఉంటున్నాయని ఇటీవల మరో అధ్యయనం బయటపెట్టింది. అలాగే వైరస్ సోకడంలో ఆడా, మగా మధ్య తేడాలకు కారణాలు కూడా కనుగొన గలిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News