Saturday, December 21, 2024

పురుష ఓటర్లు 1.62 కోట్లు… మహిళా ఓటర్లు 1.63 కోట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో 2290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. శాసన సభ ఎన్నికలలో 2068 మంది పురుషులు ఉండగా 221 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ పోటీ చేస్తున్నారు. 3.26 కోట్లకు పైగా ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఓటింగ్ కోసం తెలంగాణ వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దివ్యాంగుల కోసం 21,686 వీల్ ఛైర్లు అధికారులు సిద్ధం చేశారు. 80 ఏళ్ల పైబడిన వారికి ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తున్నారు.

బ్రెయిలీ లిపిలోనూ ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు ముద్రించారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు 644 మోడల్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. దివ్యాంగులు 120 పోలింగ్ కేంద్రాలను, మహిళలు 597 పోలింగ్ కేంద్రాలను నిర్వహించనున్నారు. పోలింగ్ క్రతువుల్లో 1.85 లక్షల మంది సిబ్బంది పాల్గొంటారు. పోలింగ్ ప్రక్రియను 22 వేల మంది మైక్రో అబ్జర్వర్లు పరిశీలించనున్నారు. తెలంగాణలో పురుష ఓటర్ల సంఖ్య 1,62, 98,418కాగా మహిళా ఓటర్ల సంఖ్య 1,63,01,705 కాగా ట్రాన్స్‌జెండర్ ఓటర్ల సంఖ్య 2676కాగా సర్వీసు ఓటర్ల సంఖ్య 15,406, ప్రవాస ఓటర్ల సంఖ్య 2944గా ఉంది. 18 నుంచి 19 ఏళ్ల వయసు ఓటర్ల సంఖ్య 9,99,667గా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News