Sunday, December 22, 2024

రాజేంద్రనగర్ హైదర్ గూడ ఎర్రబోడ కాలనీలో వీధి కుక్కల బీభత్సం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాజేంద్రనగర్ హైదర్ గూడ ఎర్రబోడ కాలనీలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. వరుసగా ఐదు మంది పై దాడి చేశాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని కరిచిన పిచ్చి కుక్క, చేయి పట్టుకొని ఈడ్చుకుంటు వెళ్లింది. కింద పడేసి నెత్తిపై విచక్షణారహితంగా కరిచి గాయ పరిచింది. అడ్డుకోవడానికి యత్నించిన మరో బాలుడి పై కూడా కుక్క దాడి చేసింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురైనారు. వీధి కుక్కల నుండి మమ్మల్ని కాపాడాలని అధికారులను వేడుకుంటున్నారు కాలనీ వాసులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News