Friday, December 27, 2024

కాబోయే భర్త ముందే యువతిపై ఆరుగురు అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

Woman rapped by friend in Hyd's Bachupalli

 

భోపాల్: కాబోయే భర్తపై దాడి చేసి అనంతరం అతడి ముందే యువతిపై ఆరుగురు అత్యాచారం చేసిన సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం రేవా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపారు. 17 ఏళ్ల యువతికి ఓ యువకుడితో పెళ్లి చేయాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. తన కాబోయే భర్తతో కలిసి యువతి అష్టభుజి దేవాలయాన్ని వెళ్లింది. అనంతరం తిరిగి వస్తుండగా ఆరుగురు వ్యక్తులు ఆ జంటను పట్టుకున్నారు.

అతడిపై దాడి చేసి అతడి ముందే ఆమెపై ఆరుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌పి తెలిపాడు. అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తరువాత పెళ్లి చేద్దామని అనుకున్నామని యువతి తల్లిదండ్రులు తెలిపారు. ఈ జంటకు ఎంగేజ్‌మెంట్ అయ్యిందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News