Saturday, December 21, 2024

మగవారి మైండ్ సెట్ మారాలి: సిపి శ్వేత

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: మగవారి మైండ్ సెట్ మారాలని సిపి శ్వేత అన్నారు. శనివారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో స్వార్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని 45 మంది ఎస్‌ఐలు, సిఐలకు రెండు రోజుల వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యకి గతంగా మనిషి మారినప్పుడు కుటుం బం సమాజం మారుతుందని తెలిపారు. మనిషిలో మార్పు వస్తే సమాజంలో మార్పు వస్తుందన్నారు. 60 మంది యూత్ పిల్లలకు రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. వారు వారి గ్రామాల్లో పట్టణాలలో ప్రజలకు యూత్ పిల్లలకు పోక్సో , మహిళల రక్షణకు ఉన్న చట్టాల అవగాహన కల్పించాలని సూచించారు. సమాజంలో స్త్రీ, పురుష, కుల, మత బేదాలకు అతీతంగా అందరు స మానమేనని మన ప్రవర్తన కూడా అలానే ఉండాలని సూచించారు. మహిళల రక్షణకు రూపొందించిన అన్ని చట్టాలను గౌరవించడంతో పాటు ఇతరులు కూడా గౌరవించేలా శక్తి వంచన లేకుండా కృషి చే యాలన్నారు.

అనంతరం స్వార్డ్ స్వచ్ఛంద సంస్థ గిరిజాదేవి మాట్లాడుతూ వివిధ గ్రామాల నుంచి సెలెక్ట్ చేసిన 60 మందికి రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. శిక్షణ పూర్తయిన వారికి సర్టిఫికేట్, చట్టాలకు సంబంధించిన బుక్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. మన ద్వారా సమాజంలో మార్పు రావాలని దానికి అందరం సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఆడ, మగ వివక్ష లేకుండా పిల్లలను పెంచాలన్నారు. నేటి తరం స్త్రీలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. సెక్స్, జెండర్ ఏ పదాల్లోకి వస్తాయో వివరించారు. సెక్స్ ప్రకృతి , సైన్స్ నుంచి వచ్చిందని, జెండర్ సమాజం నుండి వచ్చిందని తెలిపారు. జెండర్ ఈక్వాలిటి/ఈక్విటి గురించి ప్రతిఒక్కరూ పాటు పడాలని తెలిపారు. సెక్స్ జెండర్ ఈక్వాలిటి జెండర్ బెస్డ్ వైలేషన్స్ కౌన్సిలింగ్ సూటేబులిటి డెవలప్‌మెంట్ గోల్స్, రోల్ అండ్ రెస్పానిబిలిటి ఆప్ పోలీస్ పర్పస్ తదితర అgశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అదికారులకు సిబ్బందికి అవగాహన కల్పించారు. స్వార్ట్ స్వచ్ఛంద సంస్థ్ధ సిఈఓ శివకుమారి, ప్రాజెక్టు కో ఆర్డీఏటర్ సునితరాజ్, అదనపు డిసిపి మహేందర్, ఎసిపిలు దేవారెడ్డి, ఫణిందర్, సతీష్, చంద్రశేఖర్, సిఐలు జానకీరాంరెడ్డి, కృష్ణ, తిరుపతి, సంజయ్, రఘుపతిరెడ్డి, తిరుపతి, కిరణ్, దుర్గ, గురుస్వామి, ఎస్‌ఐలు, స్వార్డ్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది స్వరూప, వసంత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News