Sunday, December 29, 2024

క్రీడలతో మానసిక, శారీరక ఉల్లాసం : మిథాలీరాజ్

- Advertisement -
- Advertisement -

అల్వాల్ : యువత పెడదారి పట్టకుండా వారిలో మానసిక శారీరక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు టీం సాయి స్పోర్ట్ ఉత్సవ్ పేరిట క్రీడోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ పద్మశ్రీ మిథాలీ రాజ్ అన్నారు. శనివారం టీం సాయి సంస్థ అధినేత సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో వెంకటాపురం డివిజన్లో ఏర్పాటుచేసిన టీం సాయి క్రీడోత్సవాలను ఆమె ప్రారంభించారు. సందర్భంగా మా ట్లాడుతూ యువతలో క్రీడాశక్తిని నింపి వారి ప్రతిభను వెలికి తీసేందుకు టీం సాయి చేస్తున్న కృషి అభినందనీయమని ఇలాంటి క్రీడలు మరిన్ని ని ర్వహించాలని కోరారు.

ఎంతోమంది క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకు ఇలాంటి క్రీడా ఉత్సవాలు ఉపయోగపడతాయని వివిధ రకాల క్రీడలను భాగస్వామ్యం చేస్తూ ఇలాంటి టోర్నీలు నిర్వహించడం సంతోషకరమని అన్నారు. యువతలో చైతన్యం తీసుకువచ్చేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని టీం సాయి అధినేత సాయి ప్రసాద్ అన్నారు. మాజీ ఎమ్మెల్సీ పొంగిలేటి సుధాకర్ రెడ్డి పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News