Monday, December 23, 2024

యోగాతో మానసిక ప్రశాంతత

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: ప్రతి ఒక్కరూ యోగా ఆచరించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నిత్యం యోగా చేయడం వల్ల యవ్వనంగా ఉంటారని అనేక శారీరక రుగ్మతల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నకిరేకల్‌లో ర్యాలీ నిర్వహించి అనంతరం నకిరేకల్ జెడ్పీ హైస్కూల్‌లో యోగా ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో 30 ఏండ్ల వయస్సు నుంచే ఎంతో మంది ఆరోగ్య సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారని యోగా వల్ల మానసిక, ధీర్ఘకాలిక వ్యాధులు సైతం దూరమవుతాయన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలని కోరారు.

యోగా వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆనందరం కలుగుతుందన్నారు. యోగాతో మానవ శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటామని ఎమ్మె ల్యే అన్నారు. ప్రజలంతా ప్రతి రోజు యోగా చేయడం అలవాటు చేసుకోవాలని, పిల్లలకు కూడా యోగాను నేర్పించాలని సూచించారు. యోగా ద్వారా విద్యార్ధులు చురుకుగా ఉంటారని చదువులో కూడా రాణించే అవకాశాలు ఉన్నాయన్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రోజూ ఒక గంట లేదా అరగంట వ్యాయామంతో పాటు యోగా చేస్తే శరీరానికి చాలా మంచిదని, చిన్న చిన్న జబ్బులు కూడా యోగాతో ఇట్టే తగ్గిపోతాయన్నారు.

మనిషి శరీరం సహకరిస్తే మనం ఎన్నో రకాల కార్యక్రమాలు చేయగలమని అందుకు యోగా సాధనంగా తప్పకుండా ఆచరించాలని కోరారు. భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణంతో పాటు మంచి ఆరోగ్యాన్ని అందించాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాలు, పట్టణాలలో, పల్లె, పట్టణ ప్ర కృతి వనాలతో పాటు క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెప్పారు. కార్యక్రమంలో నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, యోగా గురూజీ మిర్యాల చల్మ రాజు, బీఆర్‌ఎస్ నాయకులు యల్లపురెడ్డి సైదిరెడ్డి, సోమ యాదగిరి, సదానందం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News