Thursday, January 23, 2025

మానసిక సమస్యలు ఉంటే ఈ నంబర్ 14416కు కాల్ చేయండి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈ సెంటర్ ఉచిత టోల్ ఫ్రీ 14416 కు ఏదైనా మానసి సమస్య ఉంటే కాల్ చేయాలని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.  హైదరాబాద్ వెంగల్ రావు నగర్ లో టెలీ మెంటల్ సెంటర్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఎర్రగడ్డ మానసిక వైద్యశాల సహకారంతో ఈ కాల్ సెంటర్ నడుస్తుందని, మెంటల్ సర్వీస్ కు కాల్ చేసిన వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. మానసిక ఇబ్బందులు ఎదురుకుంటున్న వారికి కొంత ఊరట కలిగించే ఆలోచనతో ఈ టెలీ మెంటల్ సర్వీస్ సెంటర్ ను ఏర్పాటు చేశామని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ సర్వీస్ సెంటర్ లో 25 మంది ప్రత్యేక సిబ్బంది విధులు నిర్వహిస్తారని, బెంగళూరులో ప్రత్యేక శిక్షణ తీసుకున్న వారు ఈ సెంటర్ లో పని చేస్తారని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News