Wednesday, January 22, 2025

క్రీడాలతో మానసిక ఉల్లాసం: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

- Advertisement -
- Advertisement -

Mental relaxation through sports: Minister Thalasani

హైదరాబాద్: అనునిత్యం వివిధ రకాల పని ఒత్తిళ్ల నేపథ్యంలో కొంత సమయం క్రీడలలో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుందని పశు సంవర్థక శా ఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం జింఖానా గ్రౌండ్ లో పోలీస్, జిహెచ్‌ఎంసి , డాక్టర్స్ ఆధ్వర్యంలో వజ్రోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకున్న మంత్రి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టాస్ వేసి పోటీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 15 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిసిపి చందన దీప్తి, అడిషనల్ డిసిపి వెంకటేశ్వర్లు, ఎసిపిలు రమేష్, పృథ్విధర్ రావు, సుధీర్, పలువురు సిఐ లు, ఎస్‌ఐ లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News