Monday, December 23, 2024

మెంతో ప్లస్ బామ్ డబ్బా ఆ కుటుంబానికి తీరని దు:ఖాన్ని మిగిల్చింది

- Advertisement -
- Advertisement -

 

చిన్నారి పుట్టాక తొలి న్యూ ఇయర్ వేడుకలను ఎంతో ఆనందంగా జరుపుకుంటున్న సమయంలో.. మెంతో ప్లస్ బామ్ డబ్బా ఆ కుటుంబానికి తీరని దు:ఖాన్ని మిగిల్చింది. అల్లారుముద్దుగా చూసుకుంటున్న 10 నెలల చిన్నారి తల్లిదండ్రులు చూస్తుండగానే కన్నుమూశాడు. కర్నూల్ జిల్లా బెళగల్ మండలం చింతమాను పల్లె గ్రామానికి చెందిన నల్లన్న సువర్ణ దంపతులకు పది నెలల కుమారుడు ఉన్నాడు. నూతన సంవత్సరం సందర్భంగా.. బాలుడి తల్లిదండ్రులు బంధువులతో మాట్లాడుతుండగా చిన్నారి మెంతోప్లస్ తైలం డబ్బాతో ఆడుకుంటూ నోట్లో పెట్టుకున్నాడు.

అది చిన్నారి గొంతులో ఇరుక్కుపోయింది. వెంటనే గమనించిన తల్లిదండ్రులు డబ్బాను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి బయలుదేరారు. మార్గమధ్యంలో ఆ చిన్నారి తల్లిచేతిలో కన్నుమూశాడు. గొంతులో డబ్బా ఇరుక్కోవడంతో ఊపిరాడక మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పెళ్లైన 20 ఏళ్ల తర్వాత పుట్టిన సంతానం కళ్లెదుటే మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News