Wednesday, January 22, 2025

మే 26న ‘#మెన్ టూ’

- Advertisement -
నరేష్ అగ‌స్త్య‌, బ్ర‌హ్మాజీ, హ‌ర్ష చెముడు, సుద‌ర్శ‌న్‌, మౌర్య సిద్ధ‌వ‌రం, కౌశిక్ ఘంట‌శాల‌ రియా సుమ‌న్‌, ప్రియాంక శ‌ర్మ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తోన్న చిత్రం ‘#మెన్ టూ’. లాన్‌థ్రెన్ క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై శ్రీకాంత్ జి.రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మౌర్య సిద్ధ‌వ‌రం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 26న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా..
నిర్మాత మౌర్య సిద్ధ‌వ‌రం మాట్లాడుతూ ‘‘‘#మెన్ టూ’ అనే ఫుల్ ఫన్ రైడర్‌లా ఉంటుంది. ఆడియెన్స్‌కు ఎంట‌ర్‌టైన్మెంట్ ప‌రంగా ఫుల్ మీల్స్‌లాంటి సినిమా. మంచి టీమ్ చేసిన ప్ర‌య‌త్నం. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. సినిమాను మే 26న థియేట‌ర్స్‌లో మిమ్మ‌ల్ని ప‌ల‌క‌రించ‌బోతున్నాం’’ అన్నారు.
చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ జి.రెడ్డి మాట్లాడుతూ ‘‘హ్యాష్ ట్యాగ్ మెన్స్ టూ సినిమాతో ఎవ‌రినో బాధ పెట్టాల‌నే ఉద్దేశం లేదు. ఓ విష‌యాన్ని ఓ కోణంలోనే కాకుండా మ‌రో కోణంలో కూడా చూడాల‌ని చెబుతూ ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ‘#మెన్ టూ’ను రూపొందిస్తున్నాం. మే 26న భారీగా సినిమాను విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News