Wednesday, November 6, 2024

మెరాపి అగ్నిపర్వతం పేలుళ్లు

- Advertisement -
- Advertisement -

యోగ్యాకార్టా : ఇండోనేసియా ఆదివారం అగ్నిపర్వతాల పేలుళ్లు, లావాల ఉత్పన్నతతో తల్లడిల్లింది. దేశవ్యాప్తంగా పలు చోట్ల తొలుత అగ్నిపర్వతాలు బద్ధలు కావడంతో అత్యంత ప్రధానమైన మౌంట్ మెరాపి కూడా ఆదివారం లావాలను భారీ స్థాయిలో విరజిమ్మింది. దీనితో ఈ చట్టుపక్కల ప్రాంతాలలో భారీ స్థాయిలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దీనితో వేలాది మందిని అధికార యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అత్యంత ఎక్కువ జనసమ్మర్థపు జావా దీవులలో ఉండే మెరాపి పేలి అత్యంత వేడిమితో కూడిన బూడిదను , రాళ్లురప్పలతో కూడిన ప్రవాహాలను వెదజల్లింది. ఈ లావా దిగువ ప్రాంతాలలో దాదాపు రెండు కిలోమీటర్ల వరకూ ప్రవాహంగా సాగడంతో ఈ ప్రాంతంలోని ప్రజలు నానా ఇక్కట్లకు గురయ్యారు.

విపరీతమైన వేడి, కాలుష్యానికి దెబ్బతిన్నారు. పలు చోట్ల ఇప్పటికి దాదాపుగా 100 మీటర్ల ఎత్తువరకూ గాలిలోకి వేడి మబ్బులు వ్యాపించాయి. వందలాది గ్రామాలను ఈ లావా ముంచెత్తింది. ముందు జాగ్రత్త చర్యల వల్ల ఎక్కడా ప్రాణనష్టం జరుగలేదని వెల్లడైంది. ఈ అగ్నిపర్వతం నుంచి లావా వెలువడుతూనే ఉంటుందని, స్థానికులు చాలారోజుల పాటు దీనికి కనీసం 30 కిలోమీటర్ల దూరం వరకూ తరలివెళ్లాలని అధికారులు హెచ్చరించారు. యోగ్యాకార్టాకు 30 కిలోమీటర్ల దూరంలోని మెరాపీ అగ్నిపర్వతం దాదాపు పదివేల అడుగుల ఎత్తువరకూ ఉంటుంది. జావాకు సంబంధించి ఈ ప్రాంతం అత్యంత పురాతన సాంస్కృతిక కేంద్రంగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News