Thursday, November 21, 2024

భారత్ మార్కెట్లోకి మెర్సిడెస్ బెంజ్ ఏఎంజి జి 63..ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

- Advertisement -
- Advertisement -

లగ్జరీ వాహనాల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ద్వారా అనేక అద్భుతమైన కార్లు, ఎస్‌యూవీ లను భారత మార్కెట్లో విక్రయిస్తున్న విషయం తెలిసిందే. అయితే, దీపావళి 2024 కంటే ముందే ఈ కంపెనీ భారతదేశంలో మరొక ఎస్‌యూవీ ని విడుదల చేసింది. అదే మెర్సిడెస్ బెంజ్ ఏఎంజి జి 63. ఈ నేపథ్యంలో కంపెనీ ఎంత ధరతో దీన్ని ప్రారంభించింది? ఏ రకమైన ఫీచర్లు అందించింది? ఇంజిన్ వివరాలు మనం ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

 

ఫీచర్లు

కంపెనీ ఈ ఫేస్‌లిఫ్ట్‌లో MBUX NTG7 ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, నప్పా లెదర్, కస్టమైజ్డ్ యాంబియంట్ లైట్లు, 31 అప్హోల్స్టరీ ఎంపికలు, 29 పెయింట్ స్కీమ్ ఎంపికలు, 12.3-అంగుళాల డ్రైవర్, మల్టీమీడియా టచ్ కంట్రోల్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, టైప్ సి పోర్ట్ వంటి ఫీచర్లను అందించింది. బర్మెస్టర్ 3D సరౌండ్ సౌండ్ సిస్టమ్ వంటివి స్పీకర్లతో తీసుకువచ్చింది. ఇవి కాకుండా.. ADAS, 360 డిగ్రీ కెమెరా, బ్రేక్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఎస్‌యూవీ లో అందుబాటులో ఉన్నాయి.

ఇంజిన్

మెర్సిడెస్ బెంజ్ నుండి వచ్చిన కొత్త ఏఎంజి జి 63 ఫేస్‌లిఫ్ట్ SUV నాలుగు-లీటర్ సామర్థ్యం గల V8 మైల్డ్ హైబ్రిడ్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 3982 cc ఇంజిన్ నుండి 430 kW పవర్, 850 న్యూటన్ మీటర్ టార్క్ పొందుతుంది. తేలికపాటి హైబ్రిడ్ కారణంగా..ఇది 15 kW అదనపు శక్తిని కూడా పొందుతుంది. దీని గరిష్ట వేగం 240 kmph. అయితే, 0-100 kmph వేగాన్ని అందుకోవడానికి కేవలం 4.3 సెకన్లు మాత్రమే పడుతుంది. కంపెనీ దీనికి యాక్టివ్ రైడ్ నియంత్రణ, ఆఫ్-రోడింగ్ సామర్థ్యాన్ని కూడా అందించింది.

ధర ఎంత?

భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ ఏఎంజి జి 63 ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.3.60 లక్షలుగా ఉంది. విశేషమేమిటంటే.. లాంచ్‌కు ముందు కంపెనీ దీనికి 120 కంటే ఎక్కువ బుకింగ్‌లను పొందింది. 2025 మూడవ త్రైమాసికానికి ఈ ఎస్‌యూవీ కోసం కంపెనీ బుకింగ్ ప్రారంభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News