Thursday, January 23, 2025

ఉద్యోగుల కుటుంబాల అర్హత మేరకు కారుణ్య నియామకాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉద్యోగుల కుటుంబీకులకు అర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కారుణ్య నియామకాల ఉత్తర్వులను అందజేసినట్లు రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. గిరిజన సహకార సంస్థను నమ్ముకుని అనేక కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, మానవీయ కోణంలో కారుణ్య నియామకాలు చేసిన సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం రాష్ట్ర గిరిజన సహకార సంస్థ కారుణ్య నియామకాల ఉత్తర్వులను మాసబ్ ట్యాంక్ డిఎస్‌ఎస్ భవన్ లోని శంకరన్ సమావేశ మందిరంలో 30 మందికి అందజేశారు.

ఈసందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగులు జిసిసి సంస్థ పురోగాభివృద్దికి తోడ్పాలని, జిసిసిని నమ్ముకుని విధుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సిఎం కేసీఆర్ అండగా నిలిచినట్లు తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో జిసిసి ఆధ్వర్యంలో శానిటైజర్ ఉత్పత్తి చేసి, అధిక సంఖ్యలో పంపిణీ చేసినట్లు,అటవీ ఉత్పత్తులకు మరింత బ్రాండ్ ను పెంపొందిస్తూ, సంస్థ అభివృద్ధికి బాధ్యతగా వ్యవహరించాలన్నారు.రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, వెనుకబడిన తరగతులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనార్టీ ప్రజల అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. అనేక రకాల పథకాలను అమలు చేస్తూ పేదల పక్షపాతిగా నిలిచారు. 2014 నుంచి గిరిజనులకు స్వర్ణయుగం వచ్చిందని పేర్కొన్నారు.

గిరిజనుల అస్తిత్వాన్ని గుర్తించి రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసి చూపించారని , దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజన దినోత్సవం, సంక్షేమ దినోత్సవం బ్రహ్మాండంగా మనం జరుపుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు గౌరవ వేతనం అందిస్తున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా సంస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఉద్యోగులందరిని మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిసిసి చైర్మన్ వాల్యా నాయక్, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు,గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్‌రెడ్డి, జీసీసీ జీఎం సీతారాంనాయక్, చీఫ్ ఇంజనీర్ శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News