రాయ్‌చూర్‌ను తెలంగాణలో కలపాలని కర్ణాటక బిజెపి శాసనసభ్యుడు
శివరాజ్ కోరడమే రాష్ట్ర ప్రగతికి నిదర్శనం : మంత్రి కెటిఆర్ ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు పక్కరాష్ట్రాల్లోని బిజెపి ప్రజాప్రతినిధులు ఫిదా అవుతున్నారు. ఈ విషయం పై వారు బహిరంగంగానే వ్యా ఖ్యానిస్తున్నారు. సిఎం కెసిఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నా రు. ఇక్కడ జరుగుతున్న అభివృ ద్ధిని చూసి తమ ప్రాంతాలను కూడా తెలంగాణలోనే కలపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యా ఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర బిజెపి నేత లను ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తుండగా, అధికార టిఆర్‌ఎస్ నేతలకు మరింత ఉత్సాహాన్ని కలిగి స్తోంది. సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అనతికాలంలో అన్ని రంగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతోందని పేర్కొనేందుకు సాక్షాత్తూ బిజెపి శాసనసభ్యులు చేస్తున్న ప్రకటనలు ఇందుకు నిదర్శమని వ్యాఖ్యానిస్తున్నారు.
కర్ణాటకలోని రాయిచూర్‌ను తెలంగాణలో కలపాలని ఆ ప్రాంత బిజెపి శాసనసభ్యుడు శివరాజ్ కోరడం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనమని సోమవారం రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. సదరు శాసనసభ్యుడు చేసిన ప్రకటనపై అక్కడి ప్రజలు సైతం చప్పట్లతో స్వాగతించారని ట్విట్టర్ వేదికగా కెటిఆర్ తెలిపారు. గతంలో మహారాష్ట్రలోని నాందేడ్ స్థానిక నాయకులు సైతం తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని కోరినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ట్విట్టర్‌లో టిఆర్‌ఎస్ నాయకుడు క్రిశాంక్ షేర్ చేశారు. దీనిపై కెటిఆర్ స్పందించి రీట్విట్ చేస్తూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.