Sunday, April 6, 2025

అతి త్వరలో కాంగ్రెస్‌లో బిఆర్‌ఎస్ విలీనం:మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

అతి త్వరలో కాంగ్రెస్‌లో బిఆర్‌ఎస్ విలీనం కాబోతోందని పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వేళ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు ఫలితాలు ఎలా ఉన్నా కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. బిజెపి కులమతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పినా కెసిఆర్‌లో మార్పు రాకపోవడంతో మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను ప్రజలు చావుదెబ్బ కొట్టారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News