Sunday, January 19, 2025

మున్సిపాలిటీల్లో పంచాయతీల విలీనానికి గ్రీన్‌సిగ్నల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఓఆర్‌ఆర్ పరిధిలోని గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీన ప్రక్రియలో ప్రభుత్వానికి ఊరట దక్కింది. గ్రామ పంచాయతీల విలీనంపై దా ఖలైన పిటిషన్లను హైకోర్టు గురువారం కొట్టివేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రకారమే విలీనం జరిగిందని, పాలనలో భాగంగా చట్టాలను తీసుకొచ్చే అధికారం అసెంబ్లీకి ఉందని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 51 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. అయితే పంచాయతీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టులో సవాల్ చేశారు.

విచారణ చేపట్టిన సిజె ధర్మాసనం ఈ పిటిషన్లను కొట్టివేస్తూ తాజాగా తీ ర్పు వెలువరించింది. ఈ తీర్పుతో మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీల విలీనానికి మార్గం సుగమమైంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో 12 గ్రామాలను 4 మున్సిపాలిటీల్లో కలపగా అ త్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని 28 గ్రామాలను 7 మున్సిపాలిటీ ల్లో వి లీనం చేశారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో 11 గ్రామాలను అక్కడి రెండు మున్సిపాలిటీ ల్లో విలీనం చేశారు. గ్రామ పంచాయతీల వి లీనంతో ఔటర్ రింగు రోడ్డు పరిధి మొత్తం పూ ర్తి పట్టణ ప్రాంతంగా మారనుంది. వీటికి కా వాల్సిన నిధులు, మౌలిక సదుపాయాలను ఆయా పురపాలికలు సమకూర్చనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News