Sunday, December 22, 2024

బిఆర్‌ఎస్‌లో క్రాంతికారి షేత్కారి విలీనం

- Advertisement -
- Advertisement -

సిఎం కెసిఆర్ సమక్షంలో ఆ పార్టీ అధ్యక్షుడు సతీష్ పాల్వే
రైతాంగ సంక్షేమం-, వ్యవసాయాభివృద్ధి
ప్రధాన లక్ష్యంగా తమ పార్టీని బిఆర్‌ఎస్‌లో
విలీనం చేస్తున్నట్లు సతీష్ పాల్వే ప్రకటన
ఉజ్వల భారతదేశం కోసం బిఆర్‌ఎస్ చేస్తున్న
పోరాటానికి మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశ రైతాంగం, సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణను ప్రకటించిన బిఆర్‌ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరిస్తూ రోజురోజుకీ తన ప్రాభవాన్ని, ప్రజాదరణను పెంచుకుంటూ సాగుతున్నది. ‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన బిఆర్‌ఎస్ పార్టీలో ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన నాయకులు, మేధావులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు, సైనికులు, రైతు ఉద్యమాల నాయకులు చేరి మద్దతు ప్రకటించారు. దేశం పురోగతి సాధించాలంటే బిఆర్‌ఎస్ కేంద్రంలో అధికారాన్ని చేపట్టాలని వారంతా ఎలుగెత్తి చాటారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా రైతుల హక్కుల సాధనకై అవిశ్రాంత పోరాటం చేస్తున్న ‘క్రాంతికారి షేత్కారి పార్టీ’ అధ్యక్షుడు సతీష్ పాల్వే తన పార్టీని బిఆర్‌ఎస్‌లో విలీనం చేయడం సంచలనంగా మారింది. సోమవారం హైదరాబాద్‌లో సతీష్ పాల్వే తన పార్టీ నాయకులతో కలిసి బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ గులాబీ కండువా కప్పి, వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా సతీష్ పాల్వే మాట్లాడుతూ… రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర అణగారిన వర్గాల కోసం పూర్తి స్థాయిలో పనిచేసే లక్ష్యంతో క్రాంతికారి షేత్కారి పేరుతో స్వతంత్ర రాజకీయ పార్టీని స్థాపించినట్లు తెలిపారు. రైతాంగ సంక్షేమం- వ్యవసాయాభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ప్రకటించిన బిఆర్‌ఎస్ పార్టీలో క్రాంతికారి షేత్కారి పార్టీ విలీనం చేసి, ఉజ్వల భారతదేశం కోసం బిఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతున్నట్లు సతీష్ పాల్వే ప్రకటించారు. బిఆర్‌ఎస్ పార్టీ కార్యాచరణను మహారాష్ట్రవ్యాప్తంగా విస్తరించి పార్టీని పటిష్టపరిచేందుకు శాయశక్తులా కృషి చేస్తానని సతీష్ పాల్వే స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడు, సిఎం కేసిఆర్ శీర్వాదం తనకు సదా ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
బిఆర్‌ఎస్‌లో చేరిన బిజెపి, కాంగ్రెస్, శివసేన పార్టీల నాయకులు
క్రాంతికారి షేత్కారీ పార్టీ విలీనంతో పాటు చరణ్ జి వాఘ్మరే నేతృత్వంలో బిజెపి, కాంగ్రెస్, శివసేనతో పాటు పలు ఇతర పార్టీల నాయకులు సోమవారం ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వీరిలో నరేంద్ర పహాడే, దినేష్ దమాహే, సందీప్ నాగ్పురే, సవిత వేజ్, ఉమేష్ సేతియా, రవీంద్ర ఎన్. కోటాంబకర్, అఖిలేష్ కల్పండే తదితరులున్నారు. నాగ్‌పూర్ జిల్లా ఉమ్రేడ్ తాలూకాకు చెందిన సందీప్ కాంబ్లే, మాణిక్ జకారియా, సుయాష్ జైశ్వాల్, రఘునాథ్ మస్కీ, కైలాష్ బవానే, గోండా జిల్లాకు చెందిన నంద కుమార్ బైసెస్, నరేంద్ర ఠాకూర్, నితీష్ కుమార్ ఎన్ సాహ, సంతోష్ సింగ్, హరిప్రసాద్ నవ్ లఖే బిఆర్‌ఎస్ నాగ్ పూర్ డివిజన్ కో కోఆర్డినేటర్, మాజీ ఎంఎల్‌ఎ బాలాసాహెబ్ సాలుంఖే గురుజీ నేతృత్వంలో చంద్రపూర్ జిల్లాకు చెందిన అశ్విన్ ఖోబ్రగడే, షర్మిల బిశ్వాస్, ఆనంద్ తగడే, ప్రవీణ్ భడ్ భుజే, ప్రతీక్ వాంకర్, బబ్లూ చిట్కాల తదితరులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఛైర్మన్ లక్ష్మణ్ గంగారాం పాటిల్, ఎపిఎంసి డైరక్టర్ సందీప్ లక్ష్మణ్ పాటిల్, ఎన్సీపి పార్టీ నాయకుడు ఈశ్వర్ పాటిల్, వంచిత్ బహుజన్ అఘాడీ నాయకుడు భగవాన్ ధాంగర్, మాజీ ఐఎఎస్ టి.కె. బాగుల్, ప్రణవ్ గైక్వాడ్, హీరామన్ జాదవ్, వినయ్ నికమ్, దివ్యాంగ్ అఘాడీ ప్రెసిడెంట్ దిలీప్ దిఘే, రవీంద్ర శిర్ సాగర్, అజిత్ నాలే, విజయ్ పెల్మహ్లే, ఏక్ నాథ్ ముర్తాదక్,ప్రొఫెసర్ అశోక్ న్యహార్కర్ తదితర పలు పార్టీలు, సంస్థలకు చెందిన ప్రముఖులు బిఆర్‌ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించారు.తెలంగాణ సాహు సమాజ్ గ్రూప్ పక్షాన ఆ సంస్థ తెలంగాణ అధ్యక్షుడు ఇందల్వాయ్ కిషన్ నేతృత్వంలో ఉమా మహేశ్వర్ బషెట్టి, చంద్రమౌళి, విజయ్ కుమార్, కన్నయ్య సాహు తదితరులు సిఎం కెసిఆర్‌ను కలిసి బిఆర్‌ఎస్ పార్టీకి, పార్టీ విధానాలకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News