Tuesday, January 21, 2025

బిఆర్‌ఎస్‌లోకి ‘మహా’ వలసలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మహారాష్ట్ర నుంచి బిఆర్‌ఎస్ పార్టీలోకి చేరికలు ఎడతెరిపి లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణలో జరుగుతున్న ప్రగతి నమూనా మాకూ కావాలని, కెసిఆర్ లాంటి సిఎం మాకూ నాయకత్వం వహించాలని, దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆకాంక్ష రోజురోజుకు బలపడుతున్నది. మహారాష్ట్ర నుంచి కొనసాగుతున్న ఈ చేరికల పరంపరే అందుకు నిదర్శనం. వారి ప్రజల ఆకాంక్షలను నిజం చేసే దిశగా మహారాష్ట్ర ప్రజా ప్రతినిధులు తెలంగాణ వైపు బిఆర్‌ఎస్ వైపు కదులుతున్నారు. ఇట్లా ముందుకు వస్తున్న వారిలో ఎక్కువగా, ప్రస్తుతం మంచి పదవుల్లో వుంటూ ప్రాముఖ్యత వున్న రాజకీయ పార్టీలో బలంగా పట్యుట వున్న నేతలు వుండడం ప్రాధాన్యత సంతరించుకున్నది. బిఆర్‌ఎస్ పట్ల మహారాష్ట్ర నేతల ఆసక్తి భవిష్యత్తులో అతి తక్కువ సమయంలోనే జాతీయ రాజకీయాలను ప్రభావం చేస్తుందనేది వాస్తవంగా కనిపిస్తున్నది. అక్కడ పాలకపక్ష ప్రతిపక్ష పార్టీలన్నీ చీలికలు పేలికలౌతూ మహారాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్న నేపథ్యంలో బిఆర్‌ఎస్ వర్తమాన రాజకీయ ప్రత్యామాన్నయంగా వారు ఆదరిస్తున్నారు.

తమ భవిష్యత్యుతను బాగు చేసే ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని మహారాష్ట్ర ప్రజలు, నేతలు, బిఆర్‌ఎస్ అధినేత సిఎం కెసిఆర్‌లో చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గచ్చిరోలి, చంద్రాపూర్, గోండ్వానా, పూణే తదితర ముఖ్య జిల్లాలు ప్రాంతాల నుంచి ఎన్సీపి, ఎమ్మెన్నెస్ వంటి ప్రముఖ పార్టీలకు చెందిన నేతలు ముందుకు వస్తున్నారు. దళిత గిరిజన సంఘాల్లో ఏండ్ల తరబడి పనిచేస్తున్న ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న నాయకులు కూడా బిఆర్‌ఎస్‌లో స్వచ్చందంగా చేరుతున్నారు. శనివారం నాడు ప్రగతిభవన్‌లో బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో వారు గులాబీ కుండువా కప్పుకున్నారు. తన వెంట నడవడానికి వచ్చిన మహారాష్ట్ర నేతలకు అధినేత కెసిఆర్ పార్టీ కండువా కప్పి సాదరంగా వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

బిఆర్‌ఎస్ పార్టీలో చేరిన మహారాష్ట్రకు చెందిన ప్రముఖ నేతలు..

మహారాష్ట్ర ఎన్సీపి సెక్రటరీ దినేశ్ బాబూరావు మడావి అధినేత కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. వీరి తండ్రి బాబూరావు మడావి, మూడుసార్లు ఎంఎల్‌ఎ, కాంగ్రెస్ హయాంలతో సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్‌గా కూడా పనిచేసిన గొప్పచరిత్ర వారి తండ్రిది. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే గచ్చిరోలి ప్రత్యేక జిల్లా కావాలని పోరాటం చేసిన ప్రజా ఉద్యమ కారుడు, చంద్రాపూర్ నుంచి గచ్చిరోలిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడంలో దినేశ్ తండ్రి మాజీ మంత్రి బాబూరావు పాత్ర గొప్పది. వీరు గచ్చిరోలి జిల్లాలో పెద్ద నాయకుడు, ప్రజల్లో గొప్ప ఆదరణ వున్న రాజకీయ కుటుంబం. వీరితో పాటు బిఆర్‌ఎస్‌లో చేరిన వారిలో గిరిజన హక్కుల సామాజిక కార్యకర్త బోళా శంభాజీ మడావి, పూణె జిల్లా ఎమ్‌ఎన్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు దీపక్ సురేశ్ పాటిల్, గోండ్వానా గణతంత్ర పార్టీకి చెందిన ప్రముఖ నేత చంద్రపూర్ జిల్లాకు చెందిన నేత నామ్ దేవ్ ఆడే, బంజారా సమాజ్ లీడర్, అతుల్ సతీష్ రాథోడ్, దళిత సామాజిక నేత వీరేంద్ర పాటిల్ తదితరులు బిఆర్‌ఎస్ పార్టీ అధినేత సమక్షంలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News