Saturday, November 16, 2024

సివిల్స్ మెయిన్స్ లో ఎస్సి స్టడీ సర్కిల్ విద్యార్థుల ప్రతిభ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలో తెలంగాణ లోని ఎస్సి స్టడీ సర్కిల్ కు చెందిన ముగ్గురు విద్యార్థులు ఇంటర్వ్యూకు అర్హత పొందారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఎస్సి స్టడీ సర్కిల్ లో శిక్షణ పొంది సివిల్స్ పరీక్షకు హాజరైన 16 మందిలో ముగ్గురు విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్వ్యూ కు సెలెక్ట్ అయిన వారిలో వరంగల్ జిల్లా ములుగుకు చెందిన డి. ప్రవీణ్ (హాల్ టికెట్ నెంబర్ 1035114), జనగామ కు చెందిన కె. ప్రణయ్ కుమార్ (హాల్ టికెట్ నెంబర్ 1002593) నిజామాబాద్ కు చెందిన డి. కిరణ్ కుమార్(హాల్ టికెట్ నెంబర్ 1014566) ఉన్నారు. విరు వచ్చే నెలలో నిర్వహించే ఇంటర్వ్యూ కు హాజరు కావాల్సి ఉంటుంది.

తెలంగాణ ఎస్సి స్టడీ సర్కిల్ లో శిక్షణ పొంది సివిల్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ కు హాజరైన అభ్యర్థులను రాష్ట్ర ఎస్సి సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందించారు. ఇంటర్వ్యూ లోను ఉత్తిర్నత సాధిస్తారని ఆషా భావం వ్యక్తం చేశారు. వెనుక బడిన పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి చెప్పారు. తెలంగాణ ఎస్సి స్టడీ సర్కిల్ విద్యార్థులు పలు కాంపిటిషన్ పరీక్ష ల్లో ప్రతిభ కనబరుస్తున్నారని.. ఇదే ఉత్సాహంతో ప్రతీ ఒక్క ఎస్సి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆకాంక్షించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News