Wednesday, January 22, 2025

హరీష్ రావు క్రిస్మస్ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట: క్రిస్టియన్ సోదరి, సోదరీమణులకు మాజీ మంత్రి హరీష్ రావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ని సిఎస్ఐ చర్చ్ లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాజీమంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టియన్ సోదరులు పండగ జరుపుకుంటున్నారని, 23 ఏళ్లుగా క్రమం తప్పకుండా డిసెంబర్ 25న సిద్దిపేట చర్చ్ లో మీ మధ్యలోనే క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నామని వివరించారు. సిద్ధిపేటలో క్రిస్టియన్ భవన్ నిర్మాణం చేసుకున్నామని, చర్చిల నిర్మాణంతో పాటు ఏ సమస్యలు ఉన్నమీకు ఒక అన్న, తమ్ముడిలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ఈ పర్వదినం ప్రేమా భావాన్ని, సేవాతత్పరతను, క్షమా గుణాన్నీ బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు అని ప్రశంసించారు. పర్వదినం క్రిస్టియన్ సోదరుల అందరికి శుభం చేకూరాలని అ ఏసు ప్రభును ప్రార్థించారని, కుటుంబ సమేతంగా సుఖసంతోషాలతో క్రిస్మస్ వేడుక జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. యేసు క్రీస్తు దీవెనలు ప్రతి ఒక్కరికీ లభించాలని, అందరూ సంతోషంగా జీవించాలని ప్రార్థిస్తున్నామన్నారు. చర్చ్ ప్రాంగణంలో ఒక అద్భుతమైన కన్వేషన్ హల్ నిర్మాణం చేసుకుందామని, అందుకు పూర్తి సహా సహకారం అందిస్తామని హరీష్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News