Monday, December 23, 2024

రాజకీయాల్లో లేని లోకేష్‌కు సమాధానం చెప్పనవసరం లేదు: మేరుగు

- Advertisement -
- Advertisement -

విజయవాడ: టిడిపి నేత లోకేష్‌పై మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. లోకేష్ ఎక్కడైనా ఎంఎల్‌ఎగా పోటీ చేసి గెలిచాడా? అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్‌సి కులంలో ఎవరూ పుట్టకూడదంటే లోకేష్ మాట్లాడలేదని విమర్శించారు. అంబేడ్కర్ విగ్రహం ముళ్లపొదల్లో పెట్టాలని బాబు చేశారని, బాబు దళితులను అవమానించారని, దాడులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు, జగన్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని మేరుగు నాగార్జున విమర్శలు గుప్పించారు. అంబేడ్కర్ పేరు ఉచ్ఛరించడానికి లోకేష్, చంద్రబాబు కుటుంబానికి అర్హత లేదని విమర్శించారు. చంద్రబాబు పాలనలో దళితులను మోసం చేశారని, తమకు సమవుజ్జీకాని వ్యక్తి రాజకీయాల్లో లేని లోకేష్‌కు తాము సమాధానం చెప్పనవసరం లేదని మేరుగు నాగార్జున చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News