- Advertisement -
అమరావతి: రామోజీ రావు కళ్లు ఉన్న కబోది మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. నిజాలు రాయడం రామోజీరావు చేతకాదన్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా రామోజీ వార్తలు రాస్తున్న నేపథ్యంలో మేరుగు మీడియాతో మాట్లాడారు. పథకం ప్రకారం తప్పుడు రాతలు రాస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై రామోజీ విషం కక్కుతున్నారని మండిపడ్డారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? అని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నప్పుడు రామోజీ రావు తన పత్రికలో ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. దళిత ద్రోహి చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు పాలనలో దళితులపై ఎన్నో అఘాయిత్యాలు జరిగాయని మెరుగు ధ్వజమెత్తారు.
Also Read:ఎలుగుబంటిని చంపి… భర్త, సోదరిడిని కాపాడిన మహిళ
- Advertisement -