Sunday, December 22, 2024

దోచుకున్న సొమ్మును పక్క రాష్ట్రాల్లో దాచుకున్నారు: మంత్రి మేరుగు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్కిల్ స్కామ్‌లో అడ్డంగా దొరికిన దొంగ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. ఆదివారం మంత్రి మేరుగు మీడియాతో మాట్లాడారు. బాబు హయాంలో ప్రజల సొమ్మును అడ్డగోలుగా దోచుకున్నారని, దోచుకున్న సొమ్మును పక్క రాష్ట్రాల్లో దాచుకున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో సొంత ఇల్లు కూడా చంద్రబాబు నిర్మించుకోలేదని చురకలంటించారు. తెలంగాణ ప్రయోజనాల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను పక్క రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకున్నాయని మంత్రి మేరుగు ప్రశంసించారు. సిఎం జగన్ గురించి మాట్లాడే అర్హత టిడిపి అధినేత లోకేష్‌కు లేదన్నారు. 2024 ఎన్నికల్లో సిఎం జగన్ రథచక్రాల కింద టిడిపి, మిత్ర పార్టీలు భూస్థాపితం చేస్తామని మంత్రి మేరుగు విమర్శలు గుప్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News