వైసిపి మాజీ మంత్రి మెరుగు నాగార్జునకు ఎపి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన అత్యాచారం కేసును హైకోర్టు క్వాష్ చేసింది. మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో గత ఏడాది నవంబర్‌లో తనను లైంగికంగా వేధించారని విజయవాడకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు ఉద్యోగం ఇప్పిస్తాన ని చెప్పి మేరుగు నాగార్జున రూ.90 లక్షలు తీసుకున్నాడని విజయవాడకు చెందిన బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తనను శారీరకంగా కూడా ఉపయోగించుకున్నారని పలుమార్లు అత్యాచారం చేశాడని పేర్కొంది. ఇప్పుడు తన డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. విశాఖలో ఓ గిరిజన టీచర్‌ను స్లో పాయిజన్ ద్వారా చంపేశానని, నీకు అదే గతి పడుతుందని మేరుగు నాగార్జున పిఎ మురళి బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.
తనకు రావాలని రూ.90 లక్షలను ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని ఫిర్యాదు చేసిన మహిళ తప్పుడు కేసు పెట్టినట్లుగా వాంగ్మూలం ఇచ్చిందని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ మహిళ కూడా నాగార్జునపై తాను తప్పుడు ఫిర్యాదు చేశానని, పోలీసులు కేసును కొట్టేస్తే అభ్యంతరం లేదని అఫిడవిట్ దాఖలు చేశారు. కానీ ధర్మాసనం వెంటనే క్వాష్ చేయడానికి అంగీకరించలేదు. ముందు ఫిర్యాదు చేయడం ఆ తర్వాత కోర్టుకొచ్చి కేసు కొట్టేయాలని కోరడాన్ని ఈమధ్య తరచూ చూస్తున్నామని బాధిత మహిళ కోరగానే కేసు కొట్టేయ లేమని తప్పుడు ఫిర్యాదు చేసినట్ల తేలితే ఫిర్యాదుదారు కూడా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరించింది.
పోలీసులు కూడా ఈ కేసుపై విచారణ కొనసాగించారు. అయితే మహిళ సహకరించలేదు. దీంతో పోలీసులు కూడా దర్యాప్తు చేయడానికి ఏమీ లేకపోయిం ది. చివరికి హైకోర్టు కేసును క్వాష్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అత్యాచారం కేసు తీవ్రమైనది కావడంతో ఫిర్యాదు చేసిన మహిళతో మెరుగు నాగార్జున వెంటనే రాజీకి వచ్చారని ఆమెకు ఇవ్వాల్సిన డబ్బులను ఇచ్చేయడంతో కేసును ఉపసంహరించుకున్నారని.. తప్పుడు ఫిర్యాదు చేశానని కోర్టుకు అఫిడవిట్ సమర్పించారని ఆ వ్యవహారాలను కూడా వైసిపికి చెందిన న్యాయవాదులే చూసుకున్నారని చెబుతున్నారు. అధికారం కోల్పో యిన తర్వాత పలువురు వైసిపి నేతలపై కేసులు నమోదవుతూ వస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలపై కేసులు నమోదవుతూం డటంతో చాలా మంది సైలెంట్ అయిపోయారు. అత్యాచారం కేసు తీవ్రమైనది కావడంతో బాధిత మహిళతో రాజీకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయ త్నించి అనుకున్నది మాజీ మంత్రి సాధించారు.