Sunday, December 22, 2024

మేరుగు నాగార్జున రూ. 90 లక్షలు తీసుకొని…. అత్యాచారం చేశాడు: మహిళ ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

అమరావతి: కాంట్రక్టు పనులు, ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని తనపై అత్యాచారం చేశాడని ఆరోపణలు చేస్తూ మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సిపి నేత మేరుగు నాగార్జునపై ఓ మహిళ ఫిర్యాదు చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో జరిగింది. మహిళ తెలిపిన వివరాల ప్రకారం…. గత ఐదు సంవత్సరాల నుంచి మాజీ మంత్రి మేరుగు నాగార్జునతో తనకు పరిచయం ఉందని తెలిపింది. తన శాఖ కాంట్రాక్టు పనులు ఇవ్వడంతో పాటు ఉద్యోగం ఇప్పిస్తానని తన వద్ద నుంచి 90 లక్షల రూపాయలు మంత్రి మేరుగు నాగార్జున తీసుకున్నాడని ఆరోపణలు చేసింది. పలుమార్లు కాంట్రాక్టు ఇవ్వకపోవడంతో గట్టిగా అడిగడంతో గెస్ట్ హౌజ్ రమ్మని మాజీ మంత్రి పిఎ మురళీమోహన్‌రెడ్డితో చెపించాడని తెలిపింది. తాడేపల్లి మండలం కుంచనపల్లిలో నాగార్జున ఆపార్ట్‌మెంట్‌కు మంత్రి పిఎతో కలిసి వెళ్లానని బాధితురాలు వివరించింది.

గదిలోకి వెళ్లిన వెంటనే బయట నుంచి తాళాలు వేసి అనంతరం తనపై మెరుగు నాగార్జున లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు చేసింది. పలుమార్లు తనపై అఘాయిత్యానికి మేరుగు పాల్పడ్డారని ఆరోపణలు చేసింది. తాను ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని అడిగితే చంపేస్తానని బెదిరించారని, విశాఖపట్నానికి చెందిన గిరిజన టీచర్‌ను ఇలానే బెదిరిస్తే స్లోపాయిజన్ ఇచ్చి చంపేశానని,  తనకు అదే గతి పడుతుందని పిఎ మురళీ బెదిరించారని మహిళ పేర్కొంది. రూ.90 లక్షలకు సంబంధించిన అప్పులు, ఇఎంఐల ఒత్తిడి తట్టుకోలేక ఇప్పుడు పోలీసులు ఆశ్రయించానని వివరణ ఇచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది.

సదరు మహిళతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. తన ప్రమేయం ఉన్నట్లు తేలితే ఏ శిక్ష విధించిన సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. మహిళ వద్ద రూ. 90 లక్షలు తీసుకోవడం, లైంగిక దాడికి పాల్పడడం అనేది పచ్చి అబద్ధమన్నారు. ఈ విషయంపై జిల్లా ఎస్‌పిని కలిసి పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరుతానని మెరుగు చెప్పారు. అవసరమైతే కోర్టును ఆశ్రయించి కుట్రదారులను బయటపెడుతానని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News