Saturday, November 23, 2024

రాజకీయాలు, చట్టాలపై ఎంఈఎస్ కోర్సులు ఎంతో ఉపయోగం:  మహేష్ దత్తా ఎక్కా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సామాజిక, ఆర్ధిక, పరిపాలన అంశాలను అర్ధం చేసుకోవడానికి మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్(ఎంఈఎస్) కోర్సులు అధికారులకు ఎంతగానో సహాయపడుతుందని ఎంసిఆర్ హెచ్‌ఆర్‌డి డైరెక్టర్ జనరల్ బెన్‌హర్ మహేష్ దత్తా ఎక్కా పేర్కొన్నారు. సోమవారం ఎంఈఎస్ ఆఫీసర్ల కోసం 5వ ఫౌండేషన్ కోర్సును ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ దేశంలోని రాజకీయాలు, చట్టపరమైన, పర్యావరణ సమస్యలు పూర్తిగా తెలుసుకుని సాధారణ వ్యక్తులుగా వ్యవహరించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు.

మిలటరీ ఇంజనీరింగ్ అధికారులు తమ ఉద్యోగాలను ఉన్నత స్దాయిలో నీతి, నిజాయితీతో నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎంఈఎస్ అధికారులు వారి జ్ఞానం, నైపుణ్యాలు, సామర్దాలపై తరుచుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఎంపిక చేసిన సెషన్లకు హాజరయ్యే అధికారులు అలిండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్, ఇతర సర్వీసులకు చెందిన అధికారులతో పాటు క్రాస్ సర్వీసులను సులభతరం చేయడానికి కోర్సులు ఎంతో ప్రయోజం కలిగిస్తుందన్నారు.

ఈకార్యక్రమానికి దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల నుండి 34 మంది అధికారులు పాల్గొన్నట్లు చెప్పారు. అనంతరం ఎంఈఎస్ చీఫ్ ఇంజనీర్ విజయ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ రూ. 13వేల వార్షిక బడ్జెట్‌తో ఎంఈఎస్ అతిపెద్ద ఇంజినీరింగ్, నిర్మాణం, భారతదేశంలో నిర్వహణ ఏజెన్సీలు చేసిందని, ఇది సైన్యం, వైమానిక దళం, నౌకాదళకు మద్దతు ఇవ్వడానికి పాన్-ఇండియా పాదముద్రలను కలిగి ఉందన్నారు. ఎంఈఎస్ శక్తి సంరక్షణ, పునరుత్పాదక ఇంధన వినియోగం గ్రీన్ టెక్నాలజీ రంగంలో అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News