Saturday, December 21, 2024

మరోసారి తండ్రి కాబోతున్న మెటా సిఇఒ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కొత్త సంవత్సరం వేళ మెటా సంస్థ సిఇఒ మార్క్ జుకర్ బర్గ్ సంతోషకరమైన విషయాన్ని పంచుకున్నారు. తాను మూడోసారి తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 2023లో తమ కుటుంబంలోకి మరో చిన్నారి చేరబోతున్నట్లు ఇన్ స్టాగ్రామ్ వేదికగా తెలిపారు.

మార్క్ జుకర్ బర్గ్ గర్భవతి అయిన భార్య ప్రిస్కిల్లా చాన్ ను ఆత్మీయంగా కౌగిలించుకుంటున్న ఫోటోను పోస్టు చేస్తూ హ్యాపీ న్యూ ఇయర్ మా ప్రేమకు ప్రతిరూపమైన మరో వ్యక్తి 2023 లో రాబోతున్నారు అంటు వెల్లడించారు. 2012లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంటకు 2015లో మొదటి సంతానంగా మాక్సిమా చాన్ అనే కూతురు జన్మించింది. తరువాత 2017లో జన్మించిన మరో అమ్మాయికి ఆగస్ట్ అని పేరు పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News