Sunday, March 2, 2025

మెటా నుంచి ఎఐ యాప్

- Advertisement -
- Advertisement -

కృత్రిమ మేధ (ఎఐ) విభాగంలో ఓపెన్ ఎఐ సంస్థ దూసుకుపోతోంది, చాట్ జిపిటి చాట్‌బాట్ సేవలతో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ విభాగంలో పోటీ ఇస్తున్న మెటా కూడా తన సేవలను మరింత మెరుగుపరచాలని యోచిస్తోంది. ఇందు నిమిత్తం ప్రత్యేకంగా మెటా ఎఐ యాప్‌ను విడుదల చేసేందుకు సంస్థ సన్నాహాలు చేస్తున్నదన్న వార్తలు వస్తున్నాయి. తామూ ఒక సోషల్ మీడియా యాప్‌ను తీసుకువస్తామని ఓపెన్ ఎఐ సిఇఒ శామ్ ఆల్ట్‌మన్ ప్రకటించారు.

ఓపెన్ ఎఐ, మెక్రోసాఫ్ట్ వలె మెటా కూడా ఎఐ చాట్‌బాట్ ప్రీమియం వెర్షన్‌ను తీసుకురావాలని యోచిస్తున్నట్లు ‘సిఎన్‌బిసి’ వార్తా సంస్థ తన నివేదికలో వెల్లడించింది. రెండ వ త్రైమాసికంలో ప్రత్యేక యాప్‌ను విడుదల చేయాలని అది అనుకుంటున్నదని ఆ సంస్థ తెలియజేసింది. దీనిపై ఆల్ట్‌మన్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘ఫేస్‌బుక్ ఎఐ యాప్‌ను తీసుకురావాలని చూస్తుంటే మేము కూడా సోషల్ మీడియా యాప్‌ను తీసుకువస్తాం. అప్పుడు ఫన్నీగా ఉంటుంది’ అని ఆల్ట్‌మన్ అన్నారు. అయితే, ప్రత్యేక యాప్ విషయమై మెటా నుంచి ఎటువంటి అధికారిక స్పందనా లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News