Thursday, January 23, 2025

మాస్ కమర్షియల్ ‘మీటర్’..

- Advertisement -
- Advertisement -

మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మీటర్’. రమేష్ కడూరి దర్శకత్వంలో తెరకెక్కింది. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 7న విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ని స్టార్ దర్శకుడు బాబీ కొల్లి లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా బాబీ కొల్లి మాట్లాడుతూ.. “ఈ సినిమా కిరణ్ అబ్బవరంకు మాస్ మీటర్‌ని సెట్ చేస్తోందని నమ్ముతున్నాను. టీజర్ చూస్తుంటే పక్కా మాస్ కమర్షియల్ మీటర్ అనిపిస్తోంది”అని చెప్పారు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ “టీజర్ ఎలా పరిగెట్టిందో సినిమా కూడా అలానే ఆగకుండా మాస్ మీటర్‌లో పరుగెడుతుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ గోల గోలగా వుంటుంది. మాస్ మహారాజా రవితేజ లాంటి సినిమానే ఇది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో చెర్రి, రమేష్ కడూరి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News