Wednesday, January 22, 2025

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో మీటర్ రీడర్ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కొండాపూర్ ప్రాంతంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మిటర్ రీడర్ మృతి చెందాడు. విద్యుత్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం…  కొండాపూర్ డివిజన్ సబ్ స్టేషన్ లో ఆనంద్ మిటర్ రీడర్ గా పనిచేస్తున్నారు. రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ లోని అపార్ట్ మెంట్ లో విద్యుత్ సమస్య పై ఫిర్యాదు వచ్చింది. దీంతో మీటర్ రీడర్ ఆనంద్ 11కేవి లైన్ మరమ్మతులు చేయడానికి అక్కడికి వెళ్లాడు. 11కేవి లైన్ కు మరమ్మతులు చేస్తుండగా ఆనంద్ విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. సంబంధం లేని ఉద్యోగులతో ఉన్నతాధికారులు విధులు నిర్వహిస్తున్నరని ఆరోపణలు వస్తున్నాయి. కొండాపూర్ డివిజన్ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మిటర్ రీడర్ చనిపోయాడని బంధువులు, విద్యుత్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఆనంద్ మృతికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News