09 నెలల బిల్లులు జారీ చేస్తున్న జలమండలి
ఉచిత నీటి పథకంపై నగరవాసుల విమర్శలు
డివిజన్ మేనేజర్లకు ఫిర్యాదు చేసిన పట్టించుకోని వైనం
మీటర్లు బిగించిన వాటిలో సగానికి పైగా రీడింగ్ చూపని మీటర్లు
ఆధార్ అనుసంధానం గడువు పెంచాలంటున్న అపార్టుమెంటు వాసులు
మన తెలంగాణ,సిటీబ్యూర్: గ్రేటర్ ప్రజలకు జలమండలి ఉచిత తాగు నీరు జలాలు సరఫరా చేస్తుంది. ఎన్నికల ముందు ప్రభుత్వం 20వేల లీటర్లు నీరు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చి డిసెంబర్ నెల నుంచి బిల్లులు వసూలు చేయడంలేదు. ప్రతి నల్లా కనెక్షన్‌దారులు ఆధార్ అనుసంధానం చేసుకుని మీటర్ల బిగించుకోవాలని, 20వేల లీటర్ల కంటే ఎక్కువ వినియోగిస్తే బోర్డు టారిప్ ప్రకారం బిల్లు చెల్లించాలని అధికారులు పేర్కొన్నారు. వెంటనే 24 ఏజెన్సీల ద్వారా మీటర్లు అందుబాటులో ఉంచి మీసేవ కేంద్రాల ఆధార్ ప్రక్రియ పూర్తిచేసుకుని సమీప ఏజెన్సీల వద్ద మీటర్లు బిగించుకోవాలని మూడు నెలల పాటు గడువు ఇచ్చింది. స్లమ్ కాలనీలో నివసించే 1. 96లక్షల కుటుంబాలకు మీటర్ రీడర్లు నేరుగా ఇంటికి వచ్చి ఆధార్ అనుసంధానం చేపట్టారు. మిగతా 7.87లక్షల డొమెస్టిక్ వినియోగదారులు, డొమెస్టిక్, అపార్టుమెంట్లు, 24,976 డొమెస్టిక్ బల్క్ కనెక్షన్లుదారులు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించింది.
రెండు పర్యాయాలు గడువు పెంచడంతో దాదాపు 70శాతం గృహయాజమానులు ముందుకు వచ్చిన ఆధార్ అనుసంధానం, మీటర్లు ఏర్పాటు చేసుకున్నారు. కానీ వారి కనెక్షన్లకు బిగించి మీటర్లు పనిచేయడకపోవడంతో బిల్లులు జారీ చేస్తున్నారు. ఉచిత నీటి పథకం కంటే ముందే నగరంలో 2లక్షల కనెక్షన్లకు మీటర్లు ఉన్నాయి. వాటిలో 80వేల మీటర్ల వరకు పనిచేయడం లేదని, రీడింగ్ చూపించకపోవడంతో నెలకు రూ. 300 చొప్పన బిల్లులు జారీ చేస్తున్నట్లు యాజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో కొత్త మీటర్లు బిగించిన మలక్‌పేట, సరూర్‌నగర్, అంబర్‌పేట, నాగోల్ వంటి ప్రాంతాల్లో మీటర్లు పనిచేయడం లేదని స్దానికంగా ఉండే డివిజన్ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. మీటర్లు బిగించిన ఏజెన్సీలకు చెందిన వ్యక్తుల ద్వారా మరమ్మత్తులు చేసుకోవాలని సూచనలు చేస్తున్నట్లు సరూర్‌నగర్ హుడాకాలనీకి చెందిన శ్రీనివాసరావు యాజమాని వెల్లడించారు.
09 నెలకు సంబంధించిన బిల్లులు చెల్లించాలని మెసేజ్ పంపిస్తున్నట్లు పేర్కొంటున్నారు. మీటర్ల గురించి అడిగితే పట్టించుకోకుండా నిర్లక్షం వహిస్తున్నారని మండిపడ్డారు. అదే విధంగా అపార్టుమెంటుల్లో ఒకే కనెక్షన్ ఉండటంతో అందులో నివసించే వారంతా ఉచిత వాటర్ పొందాలంటే ఆధార్‌ను లింక్ చేసుకోవాలి. ఈనిబంధన పెట్టడంతో చాలా మంది యాజమానుల పేరు మీద ప్లాట్లు ఉండగా వాటిలో ఉండేది టీనెంట్లు కావడంతో ఇబ్బందులు పడుతున్నట్లు, ప్రతి ప్లాట్ పిటిఐఎన్ వివరాలు సక్రమంగా లేకపోవడంతో ఆధార్ నమోదు కావడంలేదని పలువురు అపార్టుమెంట్ వాసులు పేర్కొంటున్నారు.
మరో సారి గడువు పెంచాలంటున్న నగర వాసులు: నల్లా కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం, మీటర్ల బిగింపు గడువు మరో 15 రోజలు పాటు పెంచాలని నగర వాసులు కోరుతున్నారు. ఎక్కువగా అపార్టుమెంట్లకు చెందిన వారు ఉండటంతో జీహెచ్‌ఎంసీ జారీ చేసే పిన్‌నెంబర్ ఆలస్యం కావడంతో ప్రక్రియ సకాలంలో పూర్తి చేయకపోతున్నట్లు యాజమానులు పేర్కొంటున్నారు. గడువు పెంచితే ప్రక్రియ త్వరగా పూర్తి చేస్తామని వెల్లడిస్తున్నారు.