Sunday, December 22, 2024

తీహార్ జైలు వార్డెన్ నిర్వహణలో మాదకద్రవ్యాల తయారీ

- Advertisement -
- Advertisement -

నిషేధిత మాదకద్రవ్యం మెథాంపెటమైన్ (మెథ్) తయారీ ల్యాబ్‌ను తీహార్ జైలు వార్డెన్,ఢిల్లీ వ్యాపారవేత్త, ముంబై కెమిస్ట్ ఈ ముగ్గురూ కలిసి గ్రేటర్ నోయిడా పరిధిలో నిర్వహిస్తున్నట్టు బయటపడడం సంచలనం కలిగిస్తోంది. అక్టోబర్ 25న ఎన్‌సిబి అధికారులు నిర్వహించిన దాడుల్లో ఈ ల్యాబ్‌ను ఒక ఇంట్లో నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఘన, ద్రవ రూపాల్లో ఉన్న దాదాపు 95 కిలోల మెథ్‌ను వారు స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఫ్యాక్టరీ ఆవరణలో ఎసిటోన్, సోడియం, హైడ్రాక్సైడ్, మిథాలిన్‌క్లోరైడ్, ప్రీమియం గ్రేడ్ ఎథనాల్, రెడ్ పాస్ఫరస్, ఈథైల్ ఎసిటేట్ వంటివి లభించాయి. దేశీయ వినియోగానికి , అంతర్జాతీయ ఎగుమతుల కోసం సింథటిక్ డ్రగ్స్‌ను తయారు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. వీటి తయారీ కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పరికరాలు కూడా ఇక్కడ ఉన్నాయి.

ఈ దాడుల సందర్భంగా పట్టుబడిన వ్యాపారవేత్తను గతంలో కూడా ఒక ఎన్డీపీఎస్ కేసులో డిపార్టుమెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అరెస్ట్ చేసింది. ఆ సమయంలో అతడు తీహార్ జైలులో ఉండగా అక్కడ వార్డెన్‌కు ఈ మత్తు వ్యాపారం నేర్పించాడు. వీరి ఫ్యాక్టరీలో ముంబైకి చెందిన కెమిస్టు మాదక ద్రవ్యాలను తయారు చేస్తుంటే , వాటి నాణ్యతను ఢిల్లీలో ఉండే మెక్సికన్ ముఠా సభ్యుడు పరీక్షిస్తుంటాడని ఎస్‌సిబీ అధికారులు తెలుసుకున్నారు. గతంలో గుజరాత్ లోని గాంధీ నగర్, అమ్రేలి, రాజస్థాన్ లోని జోథ్‌పూర్, సిరోహి, మధ్యప్రదేశ్ లోని భోపాల్ ప్రాంతాల్లో ఈ డ్రగ్స్ ల్యాబ్‌ల గుట్టును ఎన్‌సీబీ అధికారులు కనుగొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News