Friday, November 22, 2024

మేము రూ.10 లక్షలు ఇస్తాం… మోడీ రూ.30 లక్షలు ఇవ్వాలి: మెతుకు ఆనంద్

- Advertisement -
- Advertisement -


హైదరాబాద్: దళితుల ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దళితబంధు పథకం ఉందని ఎంఎల్‌ఎ మెతుకు ఆనంద్ తెలిపారు. శాసన సభలో దళితబంధుపై చర్చ జరిగినప్పుడు మెతుకు ఆనంద్ మాట్లాడారు. గత పాలకుల నిర్లక్షం వల్లనే దళితులు అభివృద్ధి చెందలేదన్నారు. ప్రతిపక్షాలు అనుకున్నట్టు దళితబంధు రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిన పథకం కాదన్నారు. దళితబంధు రూపకల్పన వెనక ఎంతో మేధోమథనం ఉందన్నారు. సామాజిక, ఆర్థిక, అసమానతలు రూపుమాపేందుకు దళితబంధు పథకాన్ని సిఎం కెసిఆర్ తీసుకొచ్చారన్నారు. జీవిత కాలంలో పది లక్షల రూపాయలు చూడని వర్గాలు ఎన్నో ఉన్నాయని, దళితబంధు దేశంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకమని ప్రశంసించారు.

దళితబంధును అందరూ ముక్తకంఠంతో స్వాగతించాలని పిలుపునిచ్చారు. బిజెపి నేతలు ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, దళితబంధుపై తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ కాంగ్రెస్ పార్టీ సరిగ్గా అమలు చేయకపోవడంతోనే దళితుల అభ్యున్నతి కోసం ఆలోచించి సిఎం కెసిఆర్ దళితబంధు పథకం తెచ్చారని కొనియాడారు. కెసిఆర్ ప్రభుత్వం పది లక్షల రూపాయలు ఇస్తుందని, రూ.30 లక్షల మోడీ ప్రభుత్వాన్ని అడిగి తీసుకరావాలని తెలంగాణ బిజెపి నేతలకు ఆనంద్ సవాలు విసిరారు. గత పాలకులు అట్టడుగు వర్గాలను పట్టించుకొని ఉంటే ఇప్పుడు దళితబంధు తీసుకొచ్చే అవసరం ఉండేది కాదన్నారు. దళితబంధుపై విపక్షాలు రాజకీయం చేయడం తగదని,

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News