Thursday, January 23, 2025

హైదరాబాద్‌లో గ్లోబల్ హెల్త్‌కేర్ విస్తరణ

- Advertisement -
- Advertisement -
2025 నాటికి కార్యాకలాపాలను మూడింతలు చేస్తాం :కంపెనీ ప్రతినిధులు
హెల్త్‌కేర్ విస్తరణకు మంచి వాతావరణం ఉంది : మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/ హైదరాబాద్: ఇప్పటికే హైదరాబాద్ నగరం అంతర్జాతీయ దిగ్గజ సంస్థల గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు కేంద్రంగా మారుతున్నది. ఇదే క్రమంలో ఈరోజు మరో ఆర్థిక సేవలు, భీమా దిగ్గజ సంస్థ మెట్ లైఫ్ హైదరాబాద్ నగరంలో తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. శుక్రవారం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మెట్ లైఫ్ కేంద్ర కార్యాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావు సంస్థ సీనియర్ ప్రతినిధి బృందంతో సమావేశం అయ్యారు.మెట్ లైఫ్ సంస్థ ప్రపంచంలోనే అత్యధిక మందికి భీమా మరియు ఆర్థిక సేవలు అందిస్తున్న సంస్థగా పేరుగాంచింది.

అమెరికా ఫార్చ్యూన్ 500 జాబితాలో ఉన్న ఇంత పెద్ద సంస్థ హైదరాబాద్ నగరంలో తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయడం పట్ల మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు.బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగంలో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా మెట్ లైఫ్ సంస్థ నిర్ణయం దోహదం చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం బ్యాంకింగ్, ఫైనాన్స్ సేవలు, భీమా రంగాలను బలోపేతం చేసేందుకు రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నదని, ఈ ప్రయత్నాలు ఫలించి అనేక దిగ్గజ సంస్థలు ఈ రంగంలో తమ కార్యకలాపాలను హైదరాబాద్ నగరం కేంద్రంగా విస్తరిస్తున్నాయని, ఇప్పటికే అనేక ప్రఖ్యాత సంస్థలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేశాయని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికే అనేక అంతర్జాతీయ దేశీయ సంస్థలు ఈ రంగంలో హైదరాబాద్ కేంద్రంగా విస్తృతమైన అభివృద్ధిని సాధిస్తున్నాయని, ఇలాంటి ఆకర్షణీయమైన హైదరాబాద్ నగరానికి మెట్ లైఫ్ సంస్థను స్వాగతిస్తున్నట్లు మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.
మెట్‌లైఫ్ కేంద్రా కార్యాలయం ఎంతో ఆకర్షించింది : కెటిఆర్
న్యూయార్క్‌లో విద్యార్థిగా, ఉద్యోగిగా పనిచేస్తున్న కాలంలో మెట్ లైఫ్ కేంద్ర కార్యాలయ భవన రాజసం, నిర్మాణ శైలి తనను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసేదని పేర్కొన్న కెటిఆర్, ఇదే కేంద్ర కార్యాలయంలో ఈరోజు తన సొంత రాష్ట్రానికి పెట్టుబడులను కోరుతూ సమావేశం కావడం, తనకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిందని మెట్ లైఫ్ సీనియర్ ప్రతినిధుల బృందంతో జరిగిన సమావేశంలో కేటీఆర్ తన స్పందనను తెలిపారు.

Metlife2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News