Friday, January 3, 2025

మెట్రో కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహానగరానికి మణిహారంగా నిలిచిన మెట్రో ఉద్యోగుల నుంచి నిరసన సెగలు ఎదుర్కొంటుంది. కరోనా తరువాత ఇప్పడిప్పుడే గాడిన పడుతున్న మెట్రో టికెట్ కౌంటర్లలో పనిచేస్తున్న ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగడంతో ఉన్నతాధికారులు ఆందోళనకు గురైయ్యారు. మెట్రో ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు ఉద్యోగుల నుంచి ఎలాంటి సమస్యలు చూడలేదు. మంగళవారం ఎల్బీనగర్ నుంచిమియాపూర్ కారిడార్‌లోని 27 స్టేషన్లలో అక్కడ విధులు నిర్వహించే ఉద్యోగులు ధర్నా చేపట్టారు. గత కొంత కాలంగా సరైన జీతభత్యాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ, విధుల్లో ఉన్నప్పుడు రిలీవర్ సరైన సమాయానికి రాకపోయిన అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఐదేళ్లగా రూ. 11వేలు జీతం మాత్రమే ఇస్తున్నారని, జీతాలు పెంచాలని వేడుకుంటున్న ఫలితం లేకుండా పోయిందని, చాలీచాలనీ వేతనాలతో బతుకు కష్టంగా మారందని ఆవేదన వ్యక్తం చేశారు.

కనీసం భోజన చేయడానికి సమయం ఇవ్వడంలేదని, వేతనాలు పెంచే వరకు విధులకు హాజరు కాబోమని తేల్చి చెప్పారు. దీనిపై కాంట్రాక్ట్ ఏజెన్సీలు హామీ ఇవ్వాలని, ఉన్నతాధికారులు తమ సమస్యలపై చొరవ చూపాలని డిమాండ్ చేశారు. దీంతో పలు స్టేషన్లలో సకాలంలో టిక్కెట్లు ఇవ్వకపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. కార్యాలయాలకు వెళ్లే సమయంలో కావడంతో కొంతమంది ఆర్టీసీ బస్సులు, క్యాబ్‌లు వెళ్లారు. మెట్రో ఉన్నతాధికారులు సిబ్బంది పట్ల వ్యవహరించే తీరుపై ప్రయాణికులు మండిపడ్డారు. రోజు రోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న ఉద్యోగులు విధులు నిర్వహిస్తూ తమను గమ్యస్ధానాలు చేరవేస్తున్నారని, అలాంటి వారిపట్ల ఎందుకు నిర్లక్షం చేస్తున్నారని విమర్శించారు. సుమారు 300మందికిపైగా ఉద్యోగులు ఆందోళన చేసినట్లు, ఇదే వైఖరి ఏజెన్సీలు వహిస్తే మరోసారి ధర్నాకు దిగుతామని ఉద్యోగులు హెచ్చరించారు. ఉన్నతాధికారులు పెద్ద మొత్తం వేతనాలు తీసుకుంటూ దర్జాగా తిరుగుతున్నారని, రాత్రింబళ్లు పనిచేస్తే కిందిస్దాయి ఉద్యోగుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని విరుచుకపడ్డారు.
కొంతమంది మెట్రో రైల్ కార్యకలపాలకు అవాంతరం కలిగిస్తున్నారు: హెచ్‌ఎంఆర్
కాంట్రాక్టింగ్ ఏజెన్సీ కింద పనిచేసే కొంతమంది టిక్కెటింగ్ సిబ్బంది మెట్రో కార్యకలపాలకు అవాంతరాలను కలిగి ఉద్ధేశ్యంతో, సహేతుకం కానప్పటికి తమ విధులకు దూరంగా ఉండి ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగించారని హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజ్‌మెంట్ పేర్కొంది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం వారు తప్పుడు సమాచారాన్ని, పుకార్లను సైతం వ్యాప్తి చేస్తున్నారు. వారి వాదనలు తప్పు వారి చర్యలు ప్రజా ప్రయోజనాలకు పూర్తి విరుద్దమైనవి. వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా హెచ్‌ఎంఆర్ మేనేజ్‌మెంట్ కోరింది. సిబ్బందికి తగిన వసతులు, ప్రయోజనాలను అందిస్తుంది. అయితే వారు మరింతగా ఏమి కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు తగిన చర్చలు జరపనుంది. రైలు కార్యకలాపాలు నిర్ధేశిత సమయానికి నడుస్తున్నాయి. తగినంతగా సిబ్బంది సైతం పూర్తిగా అందుబాటులో ఉన్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News