Thursday, January 23, 2025

పాతబస్తీ మెట్రోపై కుట్ర

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేస్తామని, ఇందుకు అడ్డుపడాలని చూస్తే నగర బహిష్కరణ శిక్ష తప్పదని బైరామల్‌గూడ వేదికంగా సిఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఎస్‌ఆర్‌డిపిలో భాగంగా ఎల్‌బినగర్ బైరామల్‌గూడ జంక్షన్ వద్ద రూ. 148.05 కోట్ల వ్యయంతో నిర్మించిన లెవల్ 2 ఫ్ల్లైఓవర్‌ను సిఎం శనివారం ప్రారంభించా రు. అనంతరం ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ పాతబస్తీలో మెట్రో రైల్ విస్తరణ పనులు ప్రారంభిస్తే వాటిని ఆపాలంటూ ఎవ రో కేంద్రానికి లేఖ రాశారని, అలాంటి వారికి నగర బహిష్కరణే అన్నారు. హైదరాబాద్‌ను అ న్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఇందులో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మురికి కూపంగా మారిన మూసీనదిని పూర్తిగా ప్రక్షాళన చేయడంతో పాటు రూ.50 వేల కోట్ల వ్య యంతో అభివృద్ధి చేయనున్నట్లు సిఎం తెలిపా రు. హైదరాబాద్ మూసీ కాలుష్యం వల్ల నల్గొండ జిల్లాలోని 50 ఎకరాలను కలుషితం చేస్తుందన్నారు.

వైబ్రంట్ తెలంగాణ 2050కి ప్రణాళికలు తయారు చేస్తున్నామని సిఎం తెలిపారు. మూసీ అభివృద్ధికి టెండర్లు పిలిచామని, మాస్టర్‌ప్లాన్ అందగానే ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని లిపారు. ఔటర్ రింగ్ రోడ్డుతోపాటు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించింది కాంగ్రెస్సేనని వీటి వల్లేనే తెలంగాణకు ఎన్నో కంపెనీలు వచ్చి మంచి గుర్తింపు ల భించిదని రేవంత్‌రెడ్డి అన్నారు. ఓఆర్‌ఆర్ లో పల ఉన్న అన్ని మున్సిపాలిటీలను హెచ్‌ఎండి ఎ పరిధిలోకి తేనున్నట్లు చెప్పారు. అదేవిధం గా 354 కిలో మీటర్ల మేర ఆర్‌ఆర్‌ఆర్ (రీజినల్ రింగ్ రోడ్డు) రాబోతుందన్నారు. హైదరాబాద్‌కు మెట్రోను తెచ్చింది కాంగ్రెస్సేనని, దీనితోనే హైదరాబాద్‌కు అనేక కంపెనీలు రావడం తో ప్రపంచ చిత్రపటం తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని చెప్పారు. మెట్రో సేవలను సామన్య ప్రజలకు అందుబాటులోకి తేవడమే తమ ప్రభుత్వ  లక్షమన్నారు. ఇందులో భాగంగా ఎల్‌బినగర్ నుంచి హయత్ నగర్‌కు, నాగోల్ టూ ఎల్‌బినగర్ అక్కడి నుంచి చాంద్రాయన్ గుట్ట వరకు అక్కడ నుంచి ఎయిర్ పోర్ట్‌కు మెట్రో విస్తరిస్తున్నమన్నారు. రానున్న 100 ఏళ్లపాటు హైదరాబాద్‌ను గొప్ప నగరంగా ఉండేలా తీర్చిదిద్దాబోతున్నామన్నారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కృష్ణా జలాలను పెంచామని, తాగునీటికి ఏలాంటి ఇబ్బందులు ఉండబోవని తెలిపారు.

ఎల్‌బినగర్ వస్తే నా గుండె దడ పెరుగుతుంది
ఎల్‌బినగర్‌కు ఎప్పుడు వచ్చినా నాకు తెలియకుండనే నా గుండె దడ పెరుగుతుందని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొండగల్ నుంచి ఓడిపోయిన నన్ను 2019లో జరిగిన సార్వత్రి ఎన్నికల్లో ఎల్‌బినగర్ ప్రజలు 30వేల మెజార్టీతో ఎంపిగా గెలిపించారన్నారు. దానితోనే నేను పిసిసి అధ్యక్షుడిన్ని, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాయన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది నా బంధువులు, ఆత్మీయులు ఉన్నారని, ఇదంతా మీ అభిమానమని, మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోను అన్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, డి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ మల్లేష్, దయానంద్, పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, మల్ రెడ్డి రంగా రెడ్డి , డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ కమిషనర్ రోనాల్ రోస్‌తో పలువురు కార్పొరేటర్లు, జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News