Saturday, November 16, 2024

ప్రయాణీకుల భద్రత కోసం మెట్రో ఓజోన్ ఆధారిత శానిటైజేషన్

- Advertisement -
- Advertisement -

Metro ozone based sanitation for passenger safety

 

హైదరాబాద్ : మెట్రో రైల్‌ను ప్రయాణీకులకు సురక్షితంగా రూపుదిద్దాలనే తమ ప్రయత్నాలలో భాగంగా ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా మెట్రో రైల్‌లో ఓజోన్ ఆధారిత శానిటైజేషన్‌ను తమ ట్రైన్ కోచ్‌లలో పరిచయం చేసింది. ఈప్రక్రియ ప్రారంభ సూచికంగా, ప్రస్తుత కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో తాము సురక్షితమైన ప్రయాణాన్ని అందించగలమనే నమ్మకాన్ని ప్రయాణీకులకు అందిస్తూ మూడు పోర్టబుల్ ఓజోకేర్ మొబిజోన్ యూనిట్లను కోచ్‌లను పరిశుభ్రం చేసేందుకు అందుబాటులోకి వచ్చింది. గాలితో పాటు ఉపరితలాలను శానిటైజ్ చేయడానికి హాస్పటిల్స్, హెల్త్‌కేర్, పుడ్ ప్రాసెసింగ్ సదుపాయాలలో విరివిరిగా ఓజోన్ వినియోగించడంతో పాటు నీటి శుద్ది కోసం కూడా వినియోగిస్తుంటారు. గత కొద్ది నెలలుగా మెట్రో కోచ్‌లలో ఓజోకేర్ మొబిజోన్ యంత్ర సామాగ్రి పనితీరు పరీక్షలను హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహించింది.

దీనిని అనుసరించిన ఎన్‌ఏబిఎల్ ధృవీకృత ల్యాబ్ ఈశానిటేజేషన్ సామర్దం పరిశీలించింది. సమర్దవంతంగా ఇది పనిచేస్తుందని నిర్దారించుకున్న తరువాత హైదరాబాద్ మెట్రో రైల్ ఇప్పుడు ఓజోకేర్ మొబిజోన్ యంత్రసామాగ్రిని మెట్రోకోచ్‌ల శానిటైజేషన్ కోసం వినియోగిస్తుంది. ఎల్ అండ్ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ అండ్ సీఈవో కెవీబీరెడ్డి మాట్లాడుతూ మూడు అత్యున్నత ఓజోకేర్ మొబిజోన్ యంత్రసామాగ్రిని పరిచయం చేయడం పట్ల మేము సంతోషంగా ఉన్నామని తెలిపారు. దీనిద్వారా మా మెట్రో ప్రయాణీకులకు పూర్తి శానిటైజ్డ్ ప్రయాణ అనుభవాలను అందిస్తున్నామన్నారు. ఈయూనిట్ల ట్రైన్ కోచ్‌ల లోపల గాలి, ఉపరితలం శానిటైజ్ చేసేందుకు సరిపోతాయని పేర్కొన్నారు. ఇవి 99శాతం పైగానే సూక్ష్మజీవులను అంతం చేస్తాయి. మెట్రో ప్రయాణీకులకు సురక్షిత ప్రయాణ అనుభవాలను అందించగలమనే భరోసా అందించే క్రమంలో మేము తీసుకున్న వ్యుహాత్మక నిర్ణయమిదన్నారు. మరీ ముఖ్యంగా పూర్తి స్దాయిలో కార్యకలపాలు ప్రారంబించిన వేళ, ఇది మా ప్రయాణీకుల నడుమ విశ్వాసం కలిగించడంతో పాటుగా ప్రస్తుత మహమ్మారి నేపథ్యంలో ప్రయాణానికి ప్రాధాన్యతా మార్గంగా మెట్రోను వినియోగించేందుకు తోడ్పడనుందని భావిస్తున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News