Thursday, January 23, 2025

మెట్రో పిల్లర్ కూలిన ఘటన… నిర్మాణ సంస్థతోసహా ఏడుగురిపై కేసు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : నగరంలో మంగళవారం నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి తల్లీ, కుమారుడు మృతి చెందిన సంఘటనకు సంబంధించి నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ పైన, సంబంధిత అధికారులు ఐదుగురితోపాటు బెంగళూరు మెట్రోరైలు కార్పొరేషన్‌కు చెందిన ఇద్దరిపైన కేసు నమోదయింది.

ఇందులో మొదటి నిందితునిగా నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీని చేర్చగా, ఆ సంస్థకు చెందిన ఐదుగురిని, మెట్రో రైల్ కార్పొరేషన్ కు డిప్యూటీ చీఫ్ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌లను ఎ7, ఎ8 నిందితులుగా కేసులో నమోదు చేశారు. కాంట్రాక్టు కంపెనీ నాగార్జున కనస్ట్రక్షన్స్ నమ్మా మెట్రో నిర్మాణాన్ని చేపట్టింది. మంగళవారం ఈ సంఘటనలో తల్లి తేజస్వి(25), రెండున్నరేళ్ల కుమార్త్ మృతి చెందిన సంగతి తెలిసిందే. భర్త లోహిత్‌తో కలి సి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News