Monday, January 27, 2025

మెట్రో పిల్లర్ కూలి మహిళా టెకీ, రెండున్నరేళ్ల కుమారుడు మృతి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: నగరంలో మంగళవారం ఉదయం దారుణ ఘటన సంభవించింది. మెట్రో రైలు కోసం నిర్మిస్తున్న పిల్లర్ కూలి రోడ్డు మీద పడగా టూవీలర్‌పై ప్రయాణిస్తున్న 28 ఏళ్ల తేజస్విని అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఆమె రెండున్నరేళ్ల కుమారుడు మరణించారు. తేజస్విని భర్త సివిల్ ఇంజనీర్ రోహిత్ కుమార్, వారి రెండున్నరేళ్ల కుమార్తె ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కెఆర్ పురం నుంచి ఎయిర్‌పోర్టు వరకు 38.44 కిలోమీటర్ల ఫేస్ 2బి కింద మెట్రో రైలు కోసం ఔటర్ రింగ్ రోడ్డు పొడవునా పిల్లర్లు నిర్మిస్తున్నారు.

పిల్లర్ నంబర్ 218 వద్ద వృత్తాకారంలో కాలమ్ నిర్మాణం కోసం నిటారుగా ఇనుప కమ్మీలు అమర్చారు. అయితే కొన్ని వందల టన్నుల బరువున్న ఈ కాలమ్ కూలిపోయి హెచ్‌బిఆర్ లేఔట్‌లోని బిజీ రోడ్డుపై 40 అడుగుల మేర పడిపోయింది. ఉదయం 10.45 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అదే సమయంలో రోడ్డు మీద టూవీలర్‌లో వెళుతున్న తేజసిని, ఆమె భర్త లోహిత్ కుమార్, రెండున్నరేళ్ల కుమారుడు విహాన్, అతని కవల సోదరి సిమెంట్ కాలమ్ పడింది.

తేజస్విని, విహాన్ తీవ్రంగా గాయపడగా వారిని అక్కడే ఉన్న స్థానికులు వెంటనే ఆల్టియస్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైనగాయాలు తగలడంతో తేజస్విని, విహాన్ చికిత్స పొందుతూ మరణించారు. తేజస్విని భర్త, ఆమె కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. వారు సురక్షితంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. తూర్పు తేజస్విని కుటుంబం బెంగళూరులోని హొరమావులో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News