Monday, December 23, 2024

మెట్రో రైలు కోచ్‌లో ఫ్యాషన్ షో(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

నాగపూర్: మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఆదివారం నడుస్తున్న మెట్రో రైలులో ఒక ఆశ్చర్యకర దృశ్యం చోటుచేసుకుంది. మెట్రో కోచ్‌లో ఫ్యాషన్ షో జరగడం చూసి ప్రయాణికులు సైతం షాక్‌కు గురయ్యారు.

పిల్లలతోసహా మహిళా, పురుష మోడల్స్ ఈ ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. వరుసగా మోడల్స్ తమ ముందు ఫ్యాషన్ షో పద్రర్శన చేయడంతో ప్రయాణికులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. సెలవు రోజు కావడంతో మెట్రో కోచ్‌లు కుటుంబాలతో నిండిపోయి ఉన్నాయి. మోడల్స్ ధరించిన డ్రస్సులను వివిధ ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్‌లకు చెందిన విద్యార్థులు డిజైన్ చేయడం విశేషం.

సంస్కృతి, వారసత్వ సంపద అనే అంశాన్ని ఆధారం చేసుకుని జరిగిన ఈ ఫ్యాషన్ షోలో మోడల్స్ భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే దుస్తులు, నగలు, ఇతర ఆభరణాలను ధరించారు. 2 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసున్న మోడల్స్ ఈ ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News