Wednesday, January 15, 2025

రెండో దశలో కోకాపేట వరకు మెట్రో రైలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో మెట్రో రైలు రెండో దశ, దూరం అంచనాలు పెంచారు. రెండో దశలో ప్రభుత్వం ప్రతిపాదనలను సమీక్షించి కొత్త ప్రతిపాదనలను రూపొందించినట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. మొదట రాయదుర్గం నుంచి విప్రో కూడలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని యూఎస్ కాన్సులేట్ వరకు 8 కిమీ. దూరాన్ని ప్రతిపాదించారు. అయితే ఇప్పుడు దీనిని కోకాపేటలోని నియోపోలిస్ వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మరో 3.3 కిమీ. పెరిగింది. దాంతోపాటు అంచనాలు కూడా పెరిగాయి.

నాగోలు, ఎల్బీనగర్, చాంద్రాయణ గుట్ట, మైలార్ దేవ్ పల్లి కూడలి నుంచి జల్ పల్లి మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు మొదట 29 కిమీ. ఎయిర్ పోర్ట్ మెట్రో మార్గాన్ని అంచనా వేశారు. అయితే దీనిని 4 కిమీ. పెంచారు. ఇదే కారిడార్ లో మైలార్ దేవ్ పల్లి నుంచి ఆరాంఘడ్, కొత్త హైకోర్టు వరకు 5 కిమీ. మెట్రో మార్గాన్ని పెంచారు. రెండో దశలో దీనిని ప్రతిపాదించారు. కాగా నాగోలు, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట మెట్రో ఇంటర్ చేంజ్ స్టేషన్లను అభివృద్ది చేయనున్నట్లు తన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి  భట్టి విక్రమార్క ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News