Sunday, December 22, 2024

గ్రేటర్‌లో మెట్రో రైల్ సేవలు పెంపు

- Advertisement -
- Advertisement -

metro rail services to increase in greater hyderabad

రేపటి నుంచి రాత్రి 11గంటల వరకు నడవనున్న సర్వీసులు
ప్రయాణికుల రద్దీతో పెంచిన మెట్రో అధికారులు
మెట్రో సేవల పెంపు హర్షం వ్యక్తం చేస్తున్న నగరవాసులు

హైదరాబాద్: నగర ప్రజలు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు మెట్రో రైల్‌లో ప్రయాణిస్తుండటంతో గత రెండు నెల నుంచి మెట్రో స్టేషన్లు రద్దీగా మారాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10.15 గంటలకు సేవలందిస్తున్న మెట్రో ప్రయాణీకులతో కిక్కిరిసిపోతుంది. మొదటి స్టేషన్ తప్ప మిగతా చోట ఎక్కడ ఎక్కిన సీటు దొరికే పరిస్థితి లేదు. కార్యాలయాలు ప్రారంభం, ముగిసే వేళ్లలో రైళ్లు జనసంద్రంగా మారాయి. దీంతో మెట్రో ఉన్నతాధికారులు ప్రయాణికులు సంఖ్య చూసి నేటి నుంచి మెట్రో రైల్ రాత్రి 11గంటలవరకు సేవలందించనున్నట్లు ప్రకటన చేసింది. కొత్త నిర్ణయంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు ఎంతో ఊరట లభించింది. రాత్రివేళ్లలో ఇంటికి చేరుకోవాలంటే క్యాబ్‌లను ఆశ్రయిస్తే రెండింతలు ధరలు పెంచి దోచుకుంటున్నారని, వర్షం కురిస్తే అంతే సంగతి వారి చెప్పినంత ఇవ్వాల్సిందే. ఇలాంటి పరిస్దితుల్లో రాత్రి సమయంలో ట్రైన్ సమయం పెంచాలని నగరవాసుల నుంచి డిమాండ్ పెరిగింది. దీనిపై అధికారులు స్పందించి ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే మెట్రో సేవలు పెంపు చేస్తామని పేర్కొన్నారు.

అనుకున్నట్లు గ్రీన్ సిగ్నల్ రాగానే రెండు రోజుల కితం 45 నిమిషాల పాటు సేవలు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. తాజా నిర్ణయంతో టర్మినల్ స్టేషన్‌లో చివరి మెట్రో రైల్ రాత్రి 11గంటలకు బయలుదేరుతుందనీ, ప్రయాణికుల డిమాండ్ మేరకు మెట్రో పొడిగించినట్లు సిబ్బంది చెబుతున్నారు. ఉదయం వేళ్లలో మార్పులేదని, రోజు మాదిరిగానే ఉదయం 6 గంటలకు ప్రారంభమైతున్నట్లు చెప్పారు. గత నెల రోజుల నుంచి మెట్రో ప్రయాణికులు సంఖ్య 3.80లక్షలకు చేరింది. పండగలు, ఉత్సవాల సమయంలో 4లక్షలపైగా జనం ప్రయానిస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. నగరంలో ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గడంతో రాత్రి 10గంటలు దాటితే రోడ్లపై బస్సుల కోసం ఎదురు చూస్తే పరిస్దితి ఉంది. ఆటోలను వెళ్లాలంటే చార్జీలు ఆదిరిపోతున్నాయి. తప్పనిసరి పరిస్ధితుల్లో ప్రయాణికులు తాము డిమాండ్ చేసినంత ఇస్తారని బావిస్తూ ఆటోలు ఇష్టాను సారంగా వసూలు చేస్తున్నారు. మెట్రో సేవల పెంపుతో నగరంలో అర్దరాత్రి వరకు సేప్‌గా ప్రయానించవచ్చని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News